Begin typing your search above and press return to search.

సింగర్ పాత్రను అద్బుతంగా పోషించిన కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   25 Sep 2021 5:30 AM GMT
సింగర్ పాత్రను అద్బుతంగా పోషించిన కేంద్రమంత్రి
X
మోడీ మంత్రివర్గంలోని మంత్రుల్లో కొందరికి స్పెషల్ టాలెంట్లు ఉన్నాయి. అలాంటివారిలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఈ మధ్యన వార్తల్లో కనిపిస్తున్నారు. తన స్పెషల్ టాలెంట్ తో తాజాగా ఆయన మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. సింగర్ గా తన ప్రతిభను ప్రదర్శించటమే కాదు.. వన్స్ మోర్ అంటూ అనిపించుకునేలా తన టాలెంట్ ను ప్రదర్శించారు. అరుణాచల్ ప్రదేశ్ క్యాడర్ కు చెందిన సివిల్ సర్వీసెస్ యువ అధికారుల ఏడాది శిక్షణ ముగిసిన నేపథ్యంలో ఆయన ముస్సోరీలోని లాక్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో నిర్వహించిన కార్యక్రమంలో తన పాటతో అందరిని ఉత్సాహాపరిచారు.

దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 1981లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘యారానా’లోని ‘తేరే జైసా యార్ కహాన్’ పాట పాడి అందరిని అలరించిన ఆయన.. తరచూ తన ఫిట్ నెస్ వీడియోల్ని షేర్ చేస్తూ ఉంటారు. కేంద్రమంత్రి పాడిన పాటను విన్నయువ అధికారులు వన్స్ మోర్ అంటూ సందడి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సైనికులతో నిర్వహించిన ఒక ప్రోగ్రాంలోనూ ఆయన పాట పాడి మనసుల్ని దోచుకున్నారు.

తాను గాయకుడ్ని కాకున్నా.. వీర జవాన్ల కోసం పాడుతున్నందుకు గర్వంగా ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్య చాలామందిని టచ్ చేసింది. ఏమైనా కేంద్రమంత్రులన్నంతనే గంభీరంగా ఉపన్యాసాలు ఇస్తూ.. ‘పెద్దరికాన్ని’ ప్రదర్శించే తీరుకు కాస్త దూరంగా కనిపిస్తుంటారు కిరణ్. తన పనితీరుతో ఇప్పటికే మోడీ సర్కారులో ప్రత్యేక ఇమేజ్ ఉన్న ఆయన.. తాజాగా తన సింగింగ్ టాలెంట్ తో అందరిని ఫిదా చేస్తున్నారని చెప్పక తప్పదు.