ఛోటా రాజన్ అఫీషియల్ గా వెళ్లిపోయాడు

Wed May 12 2021 14:00:26 GMT+0530 (IST)

Underworld Don Chhota Rajan Dies Of Covid 19

అండర్ వరల్డ్ మాఫియా డాన్ రాజేంద్ర నికల్జే ఉరఫ్ ఛోటా రాజన్ కరోనా కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. అయితే.. అతని ఆరోగ్యం కుదుట పడడంతో.. మంగళవారం తిరిగి జైలుకు తరలించినట్టు సమాచారం.61 సంవత్సరాల వయసున్న చోటా రాజన్.. ప్రస్తుతం తీహార్ జైలులో ఖైదీగా ఉంటున్నాడు. 2011లో ముంబైలో ఓ జర్నలిస్టును హత్య చేసినట్టు సాక్ష్యాధారాలతో రుజువు కావడంతో.. 2018లో న్యాయస్థానం చోటా రాజన్ కు జీవిత ఖైదు విధించింది. అయితే.. అతను కొవిడ్ బారిన పడడంతో రెండు వారాల క్రితం ఎయిమ్స్ కు తరలించారు.

అయితే.. ఈ నెల 7న కరోనాతో ఛోటా రాజన్ చనిపోయినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. జాతీయ మీడియా బ్రేకింగ్ వేయడంతో.. దేశవ్యాప్తంగా ఛానళ్లన్నీ ఫాలో అయిపోయాయి. అర గంటలోనే ఛోటా రాజన్ చనిపోయినట్టు దేశం మొత్తం తెలిసిపోయింది. అయితే.. ఆ తర్వాత కాసేపటికే ట్విస్ట్ చోటు చేసుకుంది.

ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ మరో వార్తను వెల్లడించింది. ఛోటా రాజన్ మరణించలేదని అతడు సజీవంగానే ఉన్నాడని తెలిపింది. ఎయిమ్స్ ప్రతినిధిని ఉటంకిస్తూ ఈ వార్తను ప్రసారం చేసింది. ఛోటా రాజన్ చనిపోయినట్టు వచ్చిన మీడియా కథనాల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో.. కాసేపు గందరగోళం నెలకొంది. ఆ తర్వాత ఛోటా చనిపోలేదని నిర్ధారించింది మీడియా. వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత సురక్షితంగా జైలుకు చేరాడు రాజన్.