Begin typing your search above and press return to search.

సీఎం జగన్ ముందు ఉండవల్లి సరికొత్త డిమాండ్

By:  Tupaki Desk   |   19 Feb 2020 10:47 AM GMT
సీఎం జగన్ ముందు ఉండవల్లి సరికొత్త డిమాండ్
X
అప్ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో అయన రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ తండ్రి వైఎస్ విషయాన్ని ప్రస్తావించారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కోరిక అని, అయన సీఎంగా ఉన్న సమయంలో రాయలసీమ, రాజమండ్రిలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు అంగీకరించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా అయన గుర్తు చేశారు. కాబట్టి , ఆ దిశగా ప్రభుత్వం అలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే

ఇకపోతే , రాష్ట్రంలో చాలా రోజులుగా హైకోర్ట్ బెంచ్‌ ల వ్యవహారంపై చర్చ జరుగుతోంది. మూడు రాజధానుల ప్రస్తావన రాకముందు కర్నూలుతో పాటూ విశాఖలో హైకోర్టు బెంచ్‌ లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎక్కువగా వినిపించింది. కానీ , ఎవ్వరూ ఊహించని విధంగా జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తీసుకురావడం, హైకోర్టుని కర్నూలు, తరలిస్తామని చెప్పడంతో ఈ వ్యవహారం మారిపోయింది. ఒకేవేల జరం సర్కార్ చెప్తున్నట్టు మూడు రాజధానులు ఏర్పాటైతే అమరావతి తో పాటూ విశాఖలో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో మాజీ ఎంపీ ఉండవల్లి రాసిన లేఖ తో రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే మరో కొత్త డిమాండ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. చూడాలి మరి దీనిపై సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారో..