ఎన్టీఆర్ కుమార్తెలు ఆణిముత్యాలు.. ఉండవల్లి కామెంట్స్

Sun Nov 28 2021 07:00:02 GMT+0530 (IST)

Undavalli Comments

దివంగత నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తెలు.. ఆణిముత్యాల వంటివారని.. మాజీ ఎంపీ.. విశ్లేషకులు.. ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. చంద్రబాబు తన సతీమణిని అసెంబ్లీలో అవమానించారంటూ.. ఆవేదన చెందడం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. వాస్తవానికి సెలబ్రిటీగా అన్నగారు ఎన్టీఆర్.. దూసుకుపోతున్న కాలంలోనే.. ఆయన కుమార్తెలు ఎవరూ.. బయటకు రాలేదని చెప్పారు.ఏ ఒక్కరిపైనా.. ఎలాంటి విమర్శలు.. పుకార్లు రాలేదని.. తాను ఎప్పుడూ.. ఎలాంటి వ్యాఖ్యలు వినలేదని.. చెప్పుకొచ్చారు. పైగా కేంద్ర మాజీ మంత్రి ఎన్టీఆర్ కుమార్తె.. పురందేశ్వరిని తాను చాలా దగ్గరగా చూశానని..ఆ మెతో తనకు రాజకీయంగా చాలా సన్నిహిత అనుబంధం ఉందని ఉండవల్లి చెప్పారు. చాలా మేధావిగా వ్యవహరించడంతోపాటు.. దేశవ్యాప్తంగా కూడా పురందేశ్వరి మంచి పేరు తెచ్చుకున్నారని.. చెప్పారు. అదేసమయంలో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ కూడా పైకి గంభీరంగా ఉన్నప్పటికీ.. ఎప్పుడూ.. చాలా చక్కని నవ్వుతో ఉండేవారని ఉండవల్లి పేర్కొన్నారు.

అదేసమయంలో ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరూ అల్లరి చిల్లరి వేషాలు కూడా వేయలేదని తెలిపారు. రామారావు సినిమాల్లో ఉన్నప్పుడు కానీ.. తర్వాత.. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ.. ఆయనను విమర్శించిన వారే ఉన్నారు తప్ప.. ఆయన కుటుంబాన్ని విమర్శించిన వారు ఇప్పటి వరకు ఎవరూ లేరని.. పేర్కొన్నారు. దీనికి కారణం.. ఆ కుటుంబం పద్ధతిగా వ్యవహరించడమేనని.. ఉండవల్లి వ్యాఖ్యానించారు. అలాంటి విషయం చంద్రబాబుకు కూడా తెలుసునని.. ఈ విషయాన్ని మరింత గా పెంచడం.. సరికాదని అన్నారు. అదేసమయంలో మనసు కు బాధ కలిగే చంద్రబాబు కన్నీరు పెట్టుకుని ఉంటారని.. అన్నారు. సింపతీ కోసం.. ఆయన కన్నీరు పెడతారని తాను భావించలేదని.. ఉండవల్లి పేర్కొన్నారు.