ఇంటికొచ్చిన అల్లుడి తల నరికిన మామ.. ఎందుకలా చేశారంటే?

Mon Aug 10 2020 09:15:46 GMT+0530 (IST)

Uncle who beheaded his son-in-law who came home

ఒక తండ్రి వ్యవహరించిన తీరు తూర్పుగోదావరి జిల్లాలో సంచలనంగా మారింది. ఇంటికి వచ్చిన అల్లుడి తల నరికేసిన వైనం తాజాగా చోటు చేసుకుంది. పిల్లను కట్టుకున్న అల్లుడి విషయంలో అంత దారుణానికి ఎందుకు పాల్పడినట్లు? అన్న విషయంలోకి వెళితే.. అసలు విషయం బయటకు రాక మానదు.రౌతులపూడి మండలం డీజే పురానికి చెందిన సత్యానారాయణ అనే వ్యక్తి కుమార్తె గత ఏడాది అనుమానాస్పదంగా మరణించింది. అనారోగ్యంతో మరణించింది. దీంతో.. ఆమె ఇద్దరు కుమార్తెలు తాతగారింట్లోనే ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. శనివారం రాత్రి అత్తారింటికి వచ్చిన అల్లుడు పీకల్లోతు తాగి వచ్చాడు. మాటా మాటా పెరిగింది.

ఈ సందర్భంగా అల్లుడు తాగిన మైకంలో తన భార్యను తానే చంపానని చెప్పాడు. ‘ నీ కుమార్తెను నేనే చంపాను’ అని పేర్కొన్నారు. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన సత్యనారాయణ ఉదయాన్నే.. అల్లుడి తల నరికేశాడు. అనంతరం.. తాను చేసిన నేరాన్ని చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చి.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తనతో పాటు.. తన ఇద్దరు మనమరాళ్లను వెంట పెట్టుకొని స్టేషన్ కు రావటం సంచలనంగా మారింది. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనమైంది.