Begin typing your search above and press return to search.

ఆశ్చర్యానికి గురైన ట్రంప్‌ సహాయకుడు ...

By:  Tupaki Desk   |   24 Feb 2020 11:09 AM GMT
ఆశ్చర్యానికి గురైన ట్రంప్‌ సహాయకుడు ...
X
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..ఈ రోజు ఉదయం తొలిసారిగా భారత భూభాగంపై కాలుమోపారు. తొలిసారి భారత్ పర్యటనకి వచ్చిన అమెరికా పెద్దన్నకి భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. దానికి భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది. జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రెసిండెంట్ ట్రంప్, ప్రపంచం గుర్తు పెట్టుకొనే విధంగా భారీ సన్నాహాలు జరిగాయి. అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మోతెరా స్టేడియం వరకు దాదాపు 22 కిలోమీటర్ల మేర రోడ్ షో జరిగింది. రోడ్డుకిరువైపులా ప్రజలు నిలబడి ఘన స్వాగతం పలికారు. డప్పులు, వాయిదాలు, నృత్యాలు చేస్తూగుజరాతీ సంప్రదాయ బద్ధమైన వస్త్రాలు ధరించి , ట్రంప్ కి స్వాగతం పలికారు. ఈ రోడ్ షో లో కొన్ని లక్షల మంది పాల్గొన్నారు.

ఇకపోతే ఈ రోడ్ షో చూసిన ప్రెసిడెంట్ ట్రంప్ సహాయకుడు డాన్ స్కావినో ఆశ్చర్యపోయారు. ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరిన ట్రంప్ క్యాన్వాయ్ లో ఉన్న డాన్ .. రోడ్డుకిరువైపులా లక్షల మంది ట్రంప్‌ కు వెల్ కం చెబుతూ కనిపించడం చూశారు. ఈ రోడ్‌ షో సందర్భంగా ఇంత భారీ సంఖ్యలో జనం తరలిరావడంపై ట్రంప్ సహాయకుడు - వైట్ హౌస్ సోషల్ మీడియా డైరెక్టర్ డాన్ స్వమినో జూనియర్ స్పందించారు. నమస్తే ట్రంప్‌ కు ఇంతటి విశేషాదరణ ఉంటుంది అని కలలో కూడా అనుకోలేదు అంటూ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా నమస్తే ట్రంప్ సభా పై కొన్ని ట్వీట్ చేశారు.

వావ్ అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు డాన్ స్కావినో . ‘నమస్తే ట్రంప్’ కు ఇంతటి విశేషాదరణా! అంటూ ట్వీట్ చేశారు. వాస్తవానికి ట్రంప్ కొన్నిరోజులుగా తనకు భారత్ లో నమ్మశక్యం కాని రీతిలో స్వాగతం లభిస్తుందని అంచనాలు వేయడమే కాదు, దీనిపై ప్రకటనలు కూడా చేశారు. అయితే , ఊహించిన దానికంటే , అంచనాలకు మించి స్వాగతం లభించడంతో ట్రంప్ సహాయక బృందం కూడా సంతోషం పట్టలేకపోతోంది.