Begin typing your search above and press return to search.

600 మందిని తొలగించిన ఉబెర్ ఇండియా

By:  Tupaki Desk   |   26 May 2020 9:12 AM GMT
600 మందిని తొలగించిన ఉబెర్ ఇండియా
X
ఈ మహమ్మారి, లాక్‌ డౌన్‌ సంక్షోభంతో క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ ఇండియాలో తన ఉద్యోగులపై వేటు వేసింది. భారతదేశంలో 600 మందిని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది వివిధ స్థాయిలు, టీమ్ లలో వీరిని తొలగించినట్టు ఉబెర్ తాజాగా ప్రకటించింది. డ్రైవర్ , రైడర్ సపోర్ట్ ఇతర డివిజన్లలో భారతదేశంలో దాదాపు 600 మందిని తొలగిస్తున్నట్టు ఉబెర్ ఇండియా, దక్షిణ ఆసియా అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ వెల్లడించారు.

అలాగే ప్రతి ఒక్కరికి కనీసం 10 వారాల జీతం చెల్లింపు, రాబోయే ఆరు నెలలకు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్, అవుట్ ‌ప్లేస్ ‌మెంట్ సపోర్ట్ - ల్యాప్ ‌టాప్‌ ల వాడకానికి అనుమతి ఇచ్చినట్టు ఆయన చెప్పారు- వైరస్ ప్రభావం - రికవరీపై అనిశ్చితి నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం తప్ప వేరే మార్గం లేదు అని , ఈ తగ్గింపులు ఈ నెలలో ప్రకటించిన గ్లోబల్ జాబ్ కోతల్లో భాగమని పరమేశ్వరన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 3700 మంది ఉద్యోగులను తొలగిస్తున్న మే మొదటి వారంలో ఉబెర్ ప్రకటించింది.

లాక్‌ డౌన్‌ కారణగా పలు సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ఓలా కూడా 1400 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో క్యాబ్ సర్వీసులకు అనుమతి కూడా మంజూరు చేశారు. అయినా కూడా పలు సంస్థలు మార్కెట్ సాదారణ స్థితికి ఎప్పుడు వస్తుందో అన్న టెన్షన్ తో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.