అమెరికాలో గ్యాస్ పేలుళ్లు..70 ఇళ్లల్లో మంటలు!

Fri Sep 14 2018 10:45:53 GMT+0530 (IST)

US towns rocked by up to 70 gas blasts

అమెరికాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. మాస్సాచూసెట్స్ రాష్ట్రం మెర్రిమాక్ వ్యాలీలోని అండోవర్ పట్టణంలో గురువారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) భారీ గ్యాస్ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడినట్లుగా తెలుస్తోంది.ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో దాదాపు 70 ఇళ్లలో ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. గ్యాస్ లైన్ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. గ్యాస్ పేలుళ్లు చోటు చేసుకున్న వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. బాధితుల ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అదే సమయంలో.. మంటల్లో చిక్కుకున్న ఇళ్లను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు 50 ఫైరింజన్లు.. 10 అంబులెన్స్ ల్ని రంగంలోకి దించారు. 38 చోట్ల మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. తన కెరీర్ లోనే ఇలాంటి అగ్నిప్రమాదాన్ని తాము చూడలేదని అధికారులు చెబుతున్నారు. గ్యాస్ లీకేజీతో ఏర్పడిన అగ్నిప్రమాదంలో ఒక యుద్ధభూమి వాతావరణం కనిపించినట్లుగా అగ్నిమాపక శాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. గ్యాస్ లీకేజీనే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.