Begin typing your search above and press return to search.

అమెరికా: ట్రంప్ - బైడెన్ లో ఎవరిది పైచేయి?

By:  Tupaki Desk   |   26 Sep 2020 4:30 PM GMT
అమెరికా: ట్రంప్ - బైడెన్ లో ఎవరిది పైచేయి?
X
అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంది. నవంబర్ 3న ఆ దేశంలో ఎన్నికలు జరుగునున్నాయి. ఓటర్లు ఈసారి ట్రంప్ కు పట్టం కడుతారా? ఆయన ప్రత్యర్థి జోబైడెన్ ను గెలిపిస్తారా అన్నది వేచిచూడాలి.

ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరుఫున మరోసారి అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతున్నారు. ఇక డెమొక్రటిక్ పార్టీ తరుఫున జోబైడెన్ నిలబడ్డారు. 1970 నుంచి అమెరికా రాజకీయాల్లో జోబైడెన్ ఉన్నారు. బరాక్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఎన్నికలు సమీపించడంతో ఇప్పుడు అమెరికాలో అన్ని సర్వే సంస్థలు ఓటర్ల నాడిని తెలుసుకునే పనిలో పడ్డాయి. అమెరికాలో ఓట్లు ఎక్కువగా వచ్చినా ఆ అభ్యర్థి గెలుస్తాడని చెప్పలేం. ఎందుకంటే 2016లో ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్ కు ఏకంగా 30 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. అయినా అమెరికాలోని ఎలక్ట్రోరల్ కాలేజీ వ్యవస్థలో ట్రంప్ ఎక్కువ ఓట్లు తెచ్చుకొని అధ్యక్షుడయ్యారు. దేశవ్యాప్తంగా దీనిపై ప్రజలు రోడ్డెక్కి నానా నిరసనలు తెలిపారు.

ప్రస్తుతం అన్ని జాతీయ సర్వేల్లో జోబైడెన్ ప్రత్యర్థి ట్రంప్ కంటే పైచేయి సాధించారు. అన్ని సర్వేల్లో సరాసరిగా జైబెడైన్ కు 50శాతం ఓట్లు వస్తే.. ఆయన ప్రత్యర్తి ట్రంప్ కు 40శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. జార్జియా, టెక్సాస్ రాష్ట్రాల్లో మాత్రమే జోబైడెన్ కంటే ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. మిగత రాష్ట్రాల్లో జోబైడెన్ దే ఆధిపత్యం.

అమెరికాలో జనాభాను బట్టి ఎలక్ట్రోకరల్ కాలేజీ వ్యవస్థ ఉంటుంది. మొత్తం 538 ఓట్లు ఉంటాయి. ఒక అభ్యర్థి గెలవాలంటే 270 ఓట్లు సంపాదించాలి. యుద్ధభూమి అనే పేర్కొనే రాష్ట్రాల్లో మిగతా వాటికంటే ఎక్కువ ఎలక్ట్రోరల్ ఓట్లు ఉంటాయి. అభ్యర్థులు అక్కడే ఎక్కువగా ప్రచారం చేస్తారు. ప్రస్తుతం యుద్ధభూమి రాష్ట్రాల్లో జోబైడెన్ ఆధిపత్యం ఉంది. మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యం ఉంది.

కానీ సర్వేలు కరెక్ట్ అవుతాయని చెప్పలేం. 2016లో హిల్లరీ క్లింటన్ ముందంజలో నిలిచారు. కానీ ట్రంప్ గెలిచాడు. ఇప్పుడు చాలా సర్వేలు పక్కాగా లెక్కలు వేస్తున్నాయి. కరోనా వైరస్, ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు, నిరుద్యోగం ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా ఉంది. ఎవరు అధ్యక్షుడవుతాడనేది వేచిచూడాలి.