అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికన్ యూత్ ఎవరి వైపో చెప్పిన సర్వే

Thu Oct 29 2020 13:00:38 GMT+0530 (IST)

US elections: Who will win between Trump and Biden?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే పలువురు తమ ఓట్లను పోస్టల్ బ్యాలెట్లలో నమోదు చేస్తున్నారు. నవంబరు 3న జరిగే పోలింగ్ కు కాస్త ముందుగా పోస్టల్ బ్యాలెట్లలోతమ తీర్పును నిక్షిప్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. హార్వర్డ్ కెనడీ స్కూల్ కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ విభాగం ఒక సర్వేను జాతీయ స్థాయిలో నిర్వహించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్ యువత ఏ తీరులో ఆలోచిస్తున్నారు? వారు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారు? అన్న అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.అమెరికాలోని ఓటు హక్కు ఉన్న 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లు.. ఎవరి వైపు ఉన్నారు? దానికి కారణాలు ఏమిటన్న అంశంపై సర్వేను నిర్వహించింది. దీనికి సంబందించిన ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. మిగిలిన పలు వర్గాల మాదిరే.. అమెరికన్ యువత సైతం డెమొక్రాటిక్ అభ్యర్థి జో బెడైన్ వైపే ఉన్నట్లు తేల్చింది. ట్రంప్ కంటే అధికంగా బెడైన్ వైపు ఉన్నట్లుగా సర్వే ఫలితం చెబుతోంది. ఓటుహక్కు ఉన్న వారిలో 63 శాతం మంది ఈ సర్వేలో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ఈసారి ఎన్నికల్లోనూ తాము ఓటు వేస్తామని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే.. ీసారి ఓటు వేస్తామని చెప్పిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.

సర్వే నిర్వహించిన విభాగానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న మార్క్ మాట్లాడుతూ.. ఈసారి అధ్యక్ష ఎన్నికలపై అమెరికన్ యువతో విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ఇది అమెరికా భవిష్యత్తుకు శుభ పరిణామంగా ఆయన అభివర్ణించారు. తాజా సర్వే లెక్కల ప్రకారం.. ట్రంప్ కంటే కూడా బెడైన్ వైపే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నట్లుగా తేల్చారు. మరి.. తుది ఫలితం ఏ తీరులో ఉంటుందో చూడాలి.