Begin typing your search above and press return to search.

కరోనా జాన్తానై.. ఎన్నికలకే ట్రంప్‌ మొగ్గు

By:  Tupaki Desk   |   4 April 2020 12:30 PM GMT
కరోనా జాన్తానై.. ఎన్నికలకే ట్రంప్‌ మొగ్గు
X
ప్రస్తుతం అమెరికాలో ఉన్న ట్రంప్‌ పదవీ కాలం ఈ సంవత్సరంతో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాదే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ సవంత్సరంలోనే నిర్వహించాలి. అయితే ఇప్పుడు కరోనా కేసులు అమెరికా అంతటా వ్యాపించాయి. ఆ కేసులు భారీ సంఖ్యలో పెరిగి ప్రస్తుతం అమెరికా అంతా అతలాకుతలమవుతోంది. దీంతో నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయా? లేవా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. కొన్నాళ్ల పాటు ఇన్‌చార్జ్‌ పాలన కొనసాగుతుందనే చర్చలు సాగుతున్నాయి. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ దీనిపై స్పష్టత ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు వాయిదా వేయమని.. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.

ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు.. కరోనా బారిన పడిన వారు భారీ సంఖ్యలో మృతిచెందుతున్నారు. దీంతో ఇప్పుడు అమెరికాలో కల్లోలం రేగుతోంది. అమెరికా వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న వేళ ఎన్నికలకు వెళ్తామని ట్రంప్‌ చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ముందు కరోనా నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని అమెరికాలో వివిధ పార్టీలు కోరుతున్నాయి.

ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నిక‌లు య‌థావిథిగా న‌వంబ‌ర్ 3వ తేదీనే జ‌రుగుతాయ‌ని ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికలు న‌వంబ‌ర్‌లో నిర్వహిస్తామని.. ఓట‌ర్లందరూ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకోవాలని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కొంత ఆలోచించాల్సి ఉండగా అయితే అదే మంచి పద్ధతి అని తెలిపారు. ప్రత్యక్ష ఓటు పద్ధతి ముందు ఈ-మెయిల్ ద్వారా ఓటింగ్ వేసే ప్రక్రియ సరికాదని తోసిపుచ్చారు. ఈమెయిల్ ఓటింగ్‌తో చాలా మంది మోసం చేస్తార‌ని.. అవకతవకలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్‌ బూత్‌కు వెళ్లి గ‌ర్వంగా ఓటు వేయాలని, ఓట‌రు ఐడీతోనే ఓటు హ‌క్కును వినియోగించుకోవాలని సూచించారు.

అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో ప్రైమ‌రీ ఎన్నిక‌ల‌ను వాయిదా పడ్డ విషయం తెలిసిందే. దాని మాదిరి అధ్యక్ష ఎన్నికలు కూడా వాయిదా పడుతాయని అందరూ భావించగా.. ట్రంప్‌ ప్రకటనతో ఆ ఉత్కంఠకు తెర పడింది. అధ్యక్ష ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్పటివరకు కరోనా వైరస్‌ అదుపులోకి వస్తుందా? లేదా? అని సంశయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొంటే మినహా ఎన్నికలు జరగడం కష్టమని పరిణామాలు చూస్తుంటే తెలుస్తోంది.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న ట్రంప్‌ పదవీ కాలం ఈ సంవత్సరంతో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాదే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ సవంత్సరంలోనే నిర్వహించాలి. అయితే ఇప్పుడు కరోనా కేసులు అమెరికా అంతటా వ్యాపించాయి. ఆ కేసులు భారీ సంఖ్యలో పెరిగి ప్రస్తుతం అమెరికా అంతా అతలాకుతలమవుతోంది. దీంతో నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయా? లేవా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. కొన్నాళ్ల పాటు ఇన్‌చార్జ్‌ పాలన కొనసాగుతుందనే చర్చలు సాగుతున్నాయి. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ దీని పై స్పష్టత ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు వాయిదా వేయమని.. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.