Begin typing your search above and press return to search.

ట్రంప్ ను కదిలించిన మన సినిమా..ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   22 Feb 2020 4:30 PM GMT
ట్రంప్ ను కదిలించిన మన సినిమా..ఏంటో తెలుసా?
X
ఆయన అగ్రరాజ్యానికి అధినేత.. ప్రపంచానికి పెద్దన్న. అలాంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ బాలీవుడ్ సినిమాపై స్పందించాడు.. ‘గ్రేట్ ’ అంటూ ప్రశంసించాడు కూడా.. ఇంతకీ అదే సినిమా? ఎందుకు ట్రంప్ సైతం మెచ్చుకున్నారు? ట్రంప్ ను మెప్పించేంత ఆ సినిమాలో ఏముంది? అని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ట్రంప్ ట్వీట్ వైరల్ కూడా అయ్యింది.

బాలీవుడ్ ప్రముఖ హీరో ఆయుష్మాన్ ఖురానా విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరు. ఎన్నో విభిన్నమైన సినిమాలు తీస్తూ బాలీవుడ్ లో హిట్స్ అందిస్తూ గొప్ప నటుడిగా నిరూపించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయుష్మాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శుభ్ మంగళ్ జ్యూదా సావధాన్’కు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన వచ్చింది.

హితేష్ కేవల్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్వలింగ సంపర్కం అనే కాన్సెప్ట్ లో తెరకెక్కింది. ఈ సినిమాలో ఆయుష్మాన్ గే పాత్రలో అద్భుతంగా నటించాడు. అతడి నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

ఈ సినిమా చూసిన అమెరికాకు చెందిన ప్రముఖ గే ఉద్యమకారుడు ‘పీటర్’ ట్విట్టర్ లో ఆయుష్మాన్ చిత్రం గురించి గొప్పగా ప్రశంసించాడు.

కాగా పీటర్ ట్వీట్ చూసిన ట్రంప్ ‘గ్రేట్’ అంటూ బాలీవుడ్ సినిమాకు కామెంట్ పెట్టాడు. ఇది వైరల్ గా మారింది. ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న ఈ సమయంలో భారతీయ చిత్రాన్ని ప్రశంసించడం.. ట్వీట్ చేయడంపై ఆయుష్మాన్ సినిమా యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.