Begin typing your search above and press return to search.

ఏంటీ ఈ ఖర్మ.. ఎటుపోతోంది సమాజం?

By:  Tupaki Desk   |   27 Jun 2022 3:30 PM GMT
ఏంటీ ఈ ఖర్మ.. ఎటుపోతోంది సమాజం?
X
ప్రపంచం ఏమైపోతుంది.. పురుషుడు, స్త్రీలు కలిస్తేనే సృష్టి. ఆ సృష్టిలో ఆడ,మగ కలిస్తేనే మానవ మనుగడ. కానీ ఈ ఇద్దరు అమ్మాయిలు ప్రకృతికి విరుద్ధంగా కలిశారు. అమ్మాయితో కాపురం చేయడానికి మరో అమ్మాయి ఏకంగా లింగమార్పిడి ఆపరేషన్ చేసుకొని అబ్బాయిగా మారింది. వీరిని తల్లిదండ్రులు సమాజం వ్యతిరేకించినా వినకుండా ముందుకెళ్లారు. పిల్లలు పుట్టరు అని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నా వినకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. ఇలాంటి సంఘటనలు చూస్తే అసలు ఈ ప్రపంచం ఎటుపోతోంది? అన్న ప్రశ్న ఉదయిస్తోంది.

ఇద్దరు యువతులు.. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు.. అమ్మాయి ప్రేమలో మరో అమ్మాయి గాఢంగా మునిగిపోయింది. ఇది మన రాంగోపాల్ వర్మ ‘లెస్బియన్’ మూవీలోలాగానే జరిగింది. చివరకు ఇద్దరు అమ్మాయిలు కలిసి కాపురం చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ పెద్దలు ఈ ఇద్దరు అమ్మాయిల బంధాన్ని వ్యతిరేకించారు. ఇదేంటి ఖర్మ.. ప్రకృతికి విరుద్ధంగా ఇలా అమ్మాయి మరో అమ్మాయితో పెళ్లి కాపురం ఏంటని వ్యతిరేకించారు.

పెద్దలు ఇలా అనడాన్ని సీరియస్ గా తీసుకున్న ఓ యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన ప్రియురాలిని సుఖ పెట్టడం కోసం తను లింగమార్పిడి చేయించుకొని పురుషుడిగా మారడానికి డిసైడ్ అయ్యింది. ఈ షాకింగ్ ఘటన సోమవారం ఉత్తరప్రదేశ్ లో సంచలనం రేపింది.

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చెందిన ఇద్దరు యువతులు (లెస్బియన్లు) ప్రేమించుకున్నారు. వారు జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. వారి సంబంధాన్ని ఇరు యువతుల కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో అందులో ఒక యువతి తన స్నేహితురాలితో పెళ్లి , కాపురం చేయడం కోసం ఏకంగా తన లింగాన్ని మార్చుకునేందుకు శస్త్రచికిత్స చేయించుకుంది. అమ్మాయిపై ప్రేమలో మునిగిన మరో అమ్మాయి అడ్డంకులు తొలగడానికి.. కుటుంబ సభ్యుల జోక్యాన్ని ఆపడానికి తన లింగాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు వైద్యులు తెలిపారు.

యువతి తను మగాడిగా మారడానికి ముందు కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఆమెకు మరో మార్గం లేక తన లింగాన్ని మార్చుకోవాలని నిర్ణయానికి వచ్చింది. ప్రయాగ్ రాజ్ లోని స్వరూప రాణి నెహ్రూ హాస్పిటల్ లోని వైద్యుల బృందం యువతి శరీర పైభాగాలు, ఛాతీ పునర్మిర్మాణానికి వీలుగా లింగమార్పిడి శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స పూర్తి కావడానికి మరో ఏడాదిన్నర సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. పురుషుడిగా మారడానికి యువతికి టెస్టోస్టెరాన్ రీప్లేస్ మెంట్ థెరపీ ఇస్తామని.. దీనివల్ల చాతీ భాగంలో వెంట్రుకలు వస్తాయని వైద్యులు తెలిపారు.

లింగమార్పిడి శస్త్రచికిత్స తర్వాత మహిళ గర్భవతి అయ్యే పరిస్థితి ఉండదని వైద్య నిపుణుడు డాక్టర్ మోహిత్ జైన్ వివరించారు. టెస్టోస్టెరాన్ థెరపీ ఛాతీ వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపిస్తుందని తెలిపారు. ఇలాంటి ఆపరేషన్ నిర్వహించడం ఇదే మొదటిసారని.. 18నెలల వ్యవధిలో లింగమార్పిడి చికిత్స పూర్తవుతుందని పేర్కొన్నారు. లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న యువతి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ మోహిత్ వివరించారు.

ఇలా ప్రకృతికి విరుద్ధంగా ఆ మహిళ చేసిన పని ఇప్పుడు వైరల్ అయ్యింది. అమ్మాయితో కాపురానికి అబ్బాయిగా మారిన యువతి చర్యను అందరూ వ్యతిరేకించినా ఈ లెస్బియన్ జంట మాత్రం దాన్నే కొనసాగించడం విశేషం.