Begin typing your search above and press return to search.

యూకేలో కొత్త రూల్స్‌..మ‌న విద్యార్థుల‌కు పండుగే

By:  Tupaki Desk   |   12 Dec 2019 11:30 AM GMT
యూకేలో కొత్త రూల్స్‌..మ‌న విద్యార్థుల‌కు పండుగే
X
అమెరికా మాదిరిగానే యూకేలో కూడా బహుళ వీసా విధానం అమల్లో ఉంది. ఒక్కో టాస్క్‌ ను బట్టి ఒక్కో వీసా కేటాయిస్తారు. ఇందుకోసం ఆ దేశం ‘టయర్ 4 పాయింట్ బేస్డ్’ (పీబీఎస్) అనే విధానాన్ని అనుసరిస్తుంది. ఈ విధానానికి సంబంధించి యూకే ఇటీవల కొన్ని కీలక మార్పులను చేసింది. చదువు పూర్తయిన తర్వాత మరో రెండేళ్లపాటు అక్కడే ఉండేలా కొత్త నిబంధనల్ని అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చింది. గత నిబంధనల ప్రకారం కోర్సు పూర్తయిన వెంటనే స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చేది. ఇది భారతీయ విద్యార్థులను పూర్తిగా నిరుత్సాహానికి గురి చేసింది. దీంతో గత ఏడాది యూకే వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 24 శాతానికి పడిపోయింది. తాజా నిబంధనల మేరకు అక్కడి కార్పొరేట్ కంపెనీల్లో ఇంటర్న్‌ షిప్ చేసే అవకాశం లభిస్తుంది. ఇది భారత్‌ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ సాధనలో దోహదపడుతుంది.

యూకే వీసా మంజూరు కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వ్యక్తిగతంగా లేదా టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. వీసా మంజూరు కోసం సమర్పించిన సర్టిఫికెట్స్ ఆధారంగా సదరు అభ్యర్థిని ఇంటర్వ్యూకు పిలవాలా? వద్దా? అనే విషయాన్ని కాన్సులేట్ అధికారులు నిర్ణయిస్తారు. యూకేలో విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు యూకేబీఏ నుంచి విధిగా లెసైన్స్ పొందాల్సి ఉంటుంది. టయర్-4లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్థికి కావల్సిన సీఏఎస్ కోసం సదరు యూనివర్సిటీ దరఖాస్తు చేస్తుంది. ఇందులో రిఫరెన్స్ నంబర్ - వ్యక్తిగత వివరాలు ఉంటాయి. ఎటువంటి షరతులు లేకుండా అక్కడి వర్సిటీలో చదివేందుకు ఒప్పుకోవడం - కోర్సు ప్రారంభానికి ఆరు నెలల కంటే తక్కువ సమయం ఉండడం - కోర్సుకు సంబంధించి అన్ని ఫీజులు చెల్లించడం (పీజీ కోర్సులకు) వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సీఏఎస్ కోసం వర్సిటీ దరఖాస్తు చేస్తుంది.

ఇక యూకేలోని పెద్ద దేశాలలో ఒకటైన నార్త్ యార్క్ షైర్ మ‌న దేశ‌విద్యార్థులు మొగ్గు చూపేందుకు ఎక్కువ ఆస‌క్తి చూపుతున్నారు. యార్క్ సెయింట్ జాన్ యూనివర్సిటీ వందకు పైగా దేశాల విద్యార్ధులతో నిత్యం బిజీబిజీగా ఉంటుంది. ఈ వర్సిటీ యూకేలోని మొత్తం వర్సిటీలలో టాప్ 30 వర్సిటీగా నిలిచింది. నాణ్యమైన విద్య - టీచింగ్ పరంగా విద్యార్థుల ఛాయిస్‌ విషయంలో మాత్రం టాప్ 10లో ఈ వర్సిటీ చోటు దక్కించుకోవడం గమనార్హం.ఇటీవలి కాలంలో లండన్‌లో ప్రారంభించిన యార్క్ క్యాంపస్‌లో 7000కు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ యూనివ‌ర్సిటీలో ఎంతోమంది భారత విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి కెరీర్‌లో విజయం సాధించారు. యూకే ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కొత్త వీసా విధానం 2020-21 నుంచి అమల్లోకి రానుంది. ఇది భారతీయ విద్యార్థులకు బాగా కలిసొస్తుందని చెబుతున్నారు. కాబ‌ట్టి ఆస‌క్తి ఉన్న విద్యార్థులు ఇప్ప‌టినుంచే త‌గు ప్ర‌ణాళిక‌తో సాగ‌డ మంచిది.