Begin typing your search above and press return to search.

వైసీపీ లో ఇద్దరు మంత్రులు ఔట్.. ఇన్ ఎవరంటే?

By:  Tupaki Desk   |   28 Jan 2020 3:30 PM GMT
వైసీపీ లో ఇద్దరు మంత్రులు ఔట్.. ఇన్ ఎవరంటే?
X
ఏపీ సీఎం జగన్ శాసన మండలి రద్దు తో దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 58మంది ఎమ్మెల్సీలంతా షాక్ తిన్నారు. లోకేష్, యనమల , ఎమ్మెల్సీలు గా కొనసాగుతూ మంత్రి పదవులు పొందిన మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లతో సహా చాలా మంది పదవులు కోల్పోనున్నారు. అయితే జగన్ నిర్ణయానికి అనుగుణంగా రాజీనామా చేయడానికి ఇద్దరు మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ రెడీ అయ్యారు.

శాసనమండలి రద్దుతో అందులో బలంగా ఉన్న టీడీపీ కి పెద్ద దెబ్బ పడబోతోంది. బిల్లులు అడ్డుకుంటున్న టీడీపీ కి షాక్ తప్పేలా లేదు. అయితే వైసీపీ కి నష్టం వాటిల్లుతోంది. మండలి రద్దుతో పదవులు పోయాయని నేతలంతా లబోదిబోమంటుంటే.. ఆ ఖాళీ అయ్యే రెండు స్థానాల్లో కొత్తగా మంత్రులయ్యేది ఎవరనే చర్చ వైసీపీలో సాగుతోంద. కొందరు నేతలు చకచకా పావులు కదిపి ఆ రెండు మంత్రి పోస్టులను కొట్టేయడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట..

పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో తాజాగా శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఖాయమన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోందట.. సీనియర్ నాయకుడైన ధర్మాన ఖచ్చితంగా మంత్రి అవుతారని అంతా భావించారు. కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి తనతో ఉన్న ధర్మాన కృష్ణదాస్ కే జగన్ మంత్రి పదవి ఇచ్చారు. అయితే పదవి రాకపోతే ధర్మాన వర్గం నొచ్చుకుంది. ఆయన అభిమానులు సైతం కినుక వహించారు. శ్రీకాకుళంకు ఇప్పటికే ధర్మాన అన్నయ్య కృష్ణదాస్ మంత్రిగా ఉన్నారు. మరో మంత్రి పదవి ఆ జిల్లా కు ఇవ్వాల్సి ఉన్నా దక్కలేదు. సీనియర్ అయిన ధర్మాన కు ఎంతో అనుభవం ఉంది. అసెంబ్లీ లో తన వాక్చాతుర్యం తో ధర్మాన అదరగొడుతున్నారు. వైఎస్ హయాం నుంచి ఆయన మంత్రి గా చేస్తున్నారు. పిల్లి సుభాష్ స్థానం లో ధర్మాననే తీసుకుంటారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ధర్మాన కూడా బీసీ సామాజిక వర్గమే కావడం.. గతం లో ధర్మాన నిర్వహించిన రెవెన్యూ శాఖనే పిల్లి సుభాష్ నిర్వహిస్తుండడంతో ఖచ్చితంగా ఆ పదవి లభిస్తుందని అంటున్నారు.

అయితే ఒకటే కుటుంబానికి రెండు మంత్రి పదవులు లభిస్తాయా? జగన్ ఇస్తారా అనే టెన్షన్ ధర్మాన ప్రసాదరావు వర్గాల్లో నెలకొంది. విశాఖ క్యాపిటల్ అయితే ధర్మాన కీరోల్ పోషిస్తారు. అయితే అన్నాదమ్ములకు మంత్రి పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు వెలుతాయి. దీనిపై జగన్ ఏం చేస్తారనే చర్చ ఆసక్తి రేపుతోంది.

ఇక గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి మోపిదేవి వెంకట రమణ స్థానం లో ఎవరిని తీసుకుంటారన్న దాని పై కూడా చర్చ సాగుతోంది. అంబటి రాంబాబు, రోజా తదితరుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. మరి వీరిలో కొత్తగా మంత్రి పదవులు దక్కేదెవరికోనన్న ఆసక్తి పెరిగి పోతోంది.