తల్లిని కొట్టి చంపేసి.. రక్తాన్ని దేవుడికి పూస్తూ.. కూతుళ్ల ఆటలు!

Fri Jul 23 2021 23:00:01 GMT+0530 (IST)

Two daughters kill mother and blood on photos of gods

తల్లిని చంపేసి ఆమె రక్తాన్ని దేవుళ్ల ఫొటోలకు పూస్తూ ఆటలాడారు ఇద్దరు కూతుళ్లు. ఈ ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.తిరునెల్వేలి జిల్లా పాళయంకోటైకి రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కోయిల్ పిచ్చై ఉషా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరు వీనా(21) మరొకరు రీనా(19). దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో వారిద్దరూ విడిగా ఉంటున్నారు. భర్త కోయిల్ పిచ్చై మున్నీర్ పల్లంలో ఉంటున్నాడు. ఉషా(50) ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటోంది.

అయితే.. కొంతకాలంగా ఇద్దరు కూతుళ్లకూ మతి భ్రమించింది. మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఈ మంగళవారం మధ్యాహ్నం వేళ తల్లి ఉషతో కుమార్తెలు ఇద్దరూ గొడవపడ్డారు. కొంతసేపటి తర్వాత కేకలు మరింత ఎక్కువైపోవడంతో ఇరుగుపొరుగు వారు పరిగెత్తుకెళ్లి చూశారు. అక్కడి దృశ్యం చూసి హడలిపోయారు.

తల్లి ఉషా రక్తపు మడుగులో పడిఉండగా.. మతిస్థిమితం లేని కుమార్తెలు వీనా రీనా ఇద్దరూ కలిసి ఆ రక్తంలోనూ కూర్చొని ఆడుకుంటున్నారు. తల్లి రక్తాన్ని దేవుడి చిత్రపటాలకు పూస్తూ గంతులేశారు. ఆమె ప్రాణాలతో ఉందో లేదో చూసేందుకు అవసరమైతే ఆసుపత్రికి తరలించేందుకు చుట్టుపక్కల వారు ప్రయత్నించగా.. కుమార్తెలు ఇద్దరూ తల్లివద్దకు రానివ్వలేదు.

దీంతో.. వారు పోలీసులకు సమాఆచరం ఇచ్చారు. పోలీసు విచారణలో.. కత్తి ఇనుపరాడ్డుతో దాడిచేయడం వల్లే ఆమె మృతిచెందినట్టు పోలీసులు నిర్ధారించారు. కూతుళ్లిద్దరిపై కేసు నమోదు చేసిన అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మరి ఈ హత్య వెనుకగల కారణాలేంటన్నది తెలియాల్సి ఉంది.