అమెరికాలో వరదల్లో కొట్టుకుపోయిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి

Thu Sep 16 2021 14:00:55 GMT+0530 (IST)

Two Indian students killed in floods in America

ప్రపంచంలో పెద్దన్న అమెరికాను ‘ఐడా’ హరికేన్ భయపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దీంతో అప్పటి నుంచి అమెరికా ఈ ఘటన అంటేనే భయపడిపోతుంది. ఇక మరీ ముఖ్యంగా లూసియానా న్యూయార్క్ సిటీ న్యూజెర్సీలో ఐడా బీభత్సం సృష్టించింది. ఈ దారుణమైన ఘటనలో అయితే వందల సంఖ్యలో మనుషులు తమ ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గూడులేక నిరాశ్రయులయ్యారు. గల్లంతైన చాలామంది ఆచూకీ ఇంకా దొరకలేదు.న్యూజెర్సీలో ప్రస్తుత స్థితి వరకు 29 మంది ఐడాకు చనిపోయారు. ఇటీవల న్యూజెర్సీలోని పాసైక్ ప్రాంతంలోని ఓ నదిలో ఇద్దరు ఎన్నారై విద్యార్థుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. చనిపోయిన వారిని నిధి రానా(18) ఆయూష్ రానా(21)గా అధికారులు గుర్తించారు. సెప్టెంబర్ 1న రాత్రి 9.30 గంటలకు పాసైక్ ప్రాంతంలో వీళ్లు ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. అప్పటి నుంచి వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వీరిని ఎలాగైనా గుర్తించేందుకు సిబ్బంది కొన్ని గ్రూపులుగా విడిపోయి మరీ వెతుకు లాటను సాగిస్తున్నారు. కాగా ఇలా చాలా రోజులుగా వెతుకుతుండా వారి కారు నది తీర ప్రాంతంలో బయటపడింది.

అప్పటి నుంచి పాసైక్ నది చుట్టుపక్కల నిధి ఆయూష్ కోసం ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో ఈ నెలలో 8న మొదట నిధి మృతదేహాం కీర్నీ ప్రాంతంలో నది ఒడ్డున దొరికింది. ఆ తర్వాతి రోజు కీర్నీ సరిహద్దులోని నెవార్క్ జలాల్లో ఆయూష్ మృతదేహాం దొరికింది. దీంతో సెప్టెంబర్ 10న ఈ ఇద్దరు విద్యార్థుల మృతిపై అక్కడి ప్రాంతీయ ఆరోగ్య అధికారి ప్రకటన చేసింది. నిధి ఆయూష్ మృతితో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ ఇద్దరితో పాటు మరో ముగ్గురు భారతీయులు ధనూష్ రెడ్డి మాలతి కంచే సునంద ఉపాధ్యే కూడా ఐడాకు బలైన విషయం తెలిసిందే.

అక్కడ ఈ నెలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎందుకంటే అక్కడ తుఫాన్ ఏర్పడడం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి వాగులు వంకలు నదులు పొంగి పొర్లుతున్నాయి. వీటివల్ల చాలా వరకు రోడ్లన్నీ దెబ్బ తింటున్నాయి. జనాలు అయితే అల్లకల్లోలం అవుతున్నారు. దీని వల్ల వరదలు వస్తున్నాయి. అయితే ఈ వరదలను గమనిచంకుండా ఇష్టరీతిని ప్రయాణం చేస్తుంటే కార్లు నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. అటువంటి సందర్భంగా జాగ్రత్తలు వహించాలని అక్కడి అధికారులు కోరతున్నారు. వరద ఎక్కువ ఉన్న ప్రాంతాలకు వెళ్లరాదని సూచించారు. అత్యవసర సమయమైతే అధికారుల సూచన మేరకు ప్రయాణాలు చేయాలని చెప్పారు. ఈ ఇద్దరి ఎన్నారైలు ఇండియాకు చెందిన వారే కావడంతో రోదనలు మిన్నంటాయి. భారీ వర్సాలు అమెరికాను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే న్యూయార్క్ లాంటి నగరాలు నీట మునిగాయి.