Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా లేని ఆ రెండు జిల్లాలు.. ఏంటి స్పెషల్

By:  Tupaki Desk   |   3 April 2020 1:30 AM GMT
ఏపీలో కరోనా లేని ఆ రెండు జిల్లాలు.. ఏంటి స్పెషల్
X
ఏపీలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోయాయి. ఏకంగా తెలంగాణను దాటేసేంది. దీనికంతటికి కారణం.. ఢిల్లీలోని మర్కజ్ లో నిర్వహించిన మతప్రార్థనలే. ఆ సమావేశానికి వెళ్లివచ్చిన ఏపీలోని జిల్లాల వాసులకు టెస్టులు చేయగా.. ఒక్కసారి పదుల సంఖ్యలో కొత్త కేసులు బయటపడి ఏపీలో కరోనా మీటర్ ఉవ్వెత్తున ఉరికింది. నిన్న ఒక్కరోజే ఏపీలో ఏకంగా 67కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. మొత్తం కేసుల సంఖ్య 111కు చేరింది. గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి.

అయితే ఏపీ మొత్తం కరోనా కల్లోలంతో అట్టుడుకుతున్న ఆ రెండు జిల్లాలు మాత్రం నిబ్బరంగా ఉన్నాయి. ఒక్క కేసు కూడా నమోదుకాకుండా ప్రశాంతంగా ఉన్నాయి.. అవే శ్రీకాకుళం, విజయనగరం. ఏపీకి చిట్టచివరన ఉన్న ఈ రెండు జిల్లాల్లో కరోనా బయటపడకపోవడం ప్రభుత్వానికి ఊరటనిస్తోంది. దీనికి ప్రధాన కారణంగా ఈ రెండు జిల్లాల నుంచి ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారు లేకపోవడమేనట..ఇక ఈ జిల్లాల కలెక్టర్లు కూడా తీసుకున్న చర్యలతో కరోనా కట్టడి అయ్యింది.

శ్రీకాకుళం, విజయనగరం వచ్చిన ఎన్నారైలు, ప్రవాసులను గుర్తించి క్వారంటైన్ లో ఉంచారు. వారికి కరోనా లక్షణాలు బయటపడలేదు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారందరినీ కలెక్టర్లు గుర్తించి ఇంట్లోనే ఉంచడం సత్ఫలితాలను ఇచ్చింది. ఇక ఈ రెండు జిల్లా ల నుంచి వలస వెళ్లిన వారు జిల్లాకు రాలేదు. ఎందుకంటే లాక్ డౌన్ తో రవాణా వ్యవస్థ బంద్ అయ్యి వారు అక్కడే చిక్కుకుపోయారు. ఏపీకి చివరన ఉన్న ఉత్తరాంధ్రకు రాలేకపోయారు. వలసలు లేకపోవడం.. విదేశీయులకు కరోనా సోకకపోవడంతో ఈ రెండు జిల్లాలు కరోనా నుంచి సేఫ్ జోన్ లో ఉన్నాయి.

ఢిల్లీలోని మర్కాజ్ సమావేశానికి శ్రీకాకుళం నుంచి ఎవరూ వెళ్లలేదని అధికారులు గుర్తించారు. విజయనగరం నుంచి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. పైగా ఈ రెండు జిల్లాల పక్కనున్న ఒడిషాలో అస్సలు కరోనా పెద్దగా లేదు. అది కూడా వీటిని భద్రంగా ఉంచింది. ఇక విదేశాల నుంచి వచ్చిన 34మందికి కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. దీంతో ఈ రెండు జిల్లాలు కరోనా రహితంగా ఇప్పుడు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుండడం విశేషంగా మారింది.