కవలల పండుగ.. 50+ జంటలు ఒక చోట సందడి

Tue Feb 23 2021 23:00:02 GMT+0530 (IST)

Twins Festival 50+ couples buzzing in one place

అంతర్జాతీయ కవలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో ‘కవలల’ పండుగను నిర్వహించారు. దాదాపు 50కి పైగా కవలల జంటలు ఒకే వేదికపై సందడి చేశారు.డబుల్ సిమ్ కార్డ్ మాదిరిగా.. అంత మంది కవలలు ఒకేసారి హోటల్ లో వేదికపై ఎంట్రీ ఇవ్వడంతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా వారిలో ఉన్న అద్భుత టాలెంట్స్ ను అందరి ముందు ప్రదర్శించారు. ఒకే పోలికలతో ఉన్న జోడీలను చూసి అక్కడికి వచ్చిన వారు మైమరిచిపోయారు.విశాఖలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి కవలలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ కవలల్లో ఆత్మస్థైర్యం నైపుణ్యం వెలికితీసేందుకే ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కవలలకు పలు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.ఈ కార్యక్రమానికి వచ్చిన కవలలంతా ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా టచ్ లో ఉంటున్నారు. దాదాపు 50+ జంటలు ఇలా ఒక్కటయ్యారు. పోయిన ఏడాది కరోనా కారణంగా వీరి భేటి రద్దు అయ్యింది. ఈ సంవత్సరం విశాఖలో నిర్వహించారు.