Begin typing your search above and press return to search.

ఆ దేశంలో కరోనా మాట ఎత్తితే జైలుకేనట

By:  Tupaki Desk   |   2 April 2020 6:30 PM GMT
ఆ దేశంలో కరోనా మాట ఎత్తితే జైలుకేనట
X
ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా. ఇందుకు ఏ దేశం అతీతం కాదని చాలామంది అనుకుంటారు. అందులో నిజం కొంత ఉన్నా.. పూర్తిగా కాదు. దాదాపు 190 దేశాలకు విస్తరించిన కరోనా..కొన్ని దేశాల్లో మాత్రం దాని ఉనికి తమ వద్దకు రాకుండా ఉండటానికి చాలానే చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో.. దాని మాట ఎత్తేందుకు సైతం ఇష్టపడని దేశాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లోకే వస్తుంది తుర్కెమెనిస్థాన్. ప్రపంచంలోని చాలా దేశాలకు భిన్నంగా ఇక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

ఆ దేశంలోని ప్రజలు ఎవరూ కూడా కరోనా అన్న పదాన్ని ప్రస్తావించటాన్ని నిషేధించింది. ఎవరైనా కరోనా వ్యాప్తి గురించి మాట్లాడితే చాలు.. నేరుగా జైలుకే పంపుతున్నారు. చివరకు ఆ దేశ ఆరోగ్య శాఖ పంపిణీ చేసే ప్రచార పత్రాల్లోనూ కరోనా పదం అన్నది కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగా మఫ్టీలో ఉన్న పోలీసులు ప్రజలతో కలిసిపోయి తిరుగుతుంటారు. ఎవరైనా కరోనా ప్రస్తావన తెచ్చినా.. దాని వ్యాప్తి గురించి మాట్లాడటం గమనించినా.. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని జైలుకు పంపుతున్నారు. దీంతో.. ఆ దేశ ప్రజలకు కరోనా గురించి.. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర పరిస్థితుల గురించి అస్సలు తెలీదట.

అంతేకాదు.. కరోనా రాకుండా ముందస్తుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాల్ని రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. కఠినమైన ఆంక్షలే కాదు.. అంతకు మించిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కరోనాను తమ దేశంలోకి అడుగు పెట్టకుండా చేయటంలో ఆ చిన్న దేశం సక్సెస్ అయ్యిందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటివి ఊహించటం కూడా కష్టమే. మొత్తానికి కరోనాను కంట్రోల్ చేయగలిగినోళ్లు ఉండటం గొప్పేనని చెప్పక తప్పదు.