ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ : గవర్నర్

Tue May 18 2021 10:00:01 GMT+0530 (IST)

Ts Governor Talking About Corona

తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా మహమ్మారి కేసులు కొంచెం కొంచెం గా పెరిగిపోతున్నాయి. అయితే ప్రభుత్వం ఇప్పటికే కరోనా కట్టడి లో భాగంగా లాక్ డౌన్ అలాగే కర్ఫ్యూ ను అమలు చేస్తుంది. అయితే రాష్ట్రంలో అనుకున్నంత వేగంగా ఐతే వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగడంలేదు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కరోనా కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ కావడంతో దానిపై మరింత దృష్టి పెట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చూడాలన్నారు. ఇక ఇదిలా ఉంటె.. రాజ్‌భవన్ లోని  ఉన్నతాధికారులతో గవర్నర్ తమిళిసై పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆరోగ్యవంతమైన రాష్ట్ర సాధనకు ప్రజలు కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. మహమ్మారి ప్రబలకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సమష్టి కృషితో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని సాధించుకోగలం అని చెప్పారు. సెకండ్ వేవ్ లో పిల్లలు కొవిడ్ బారినపడటం ఆందోళన కలిగించే విషయమన్నారు.కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రతిఒక్కరూ విధిగా మాస్కు ధరించడంతోపాటు ఇతర నివారణ పద్ధతులను పాటించాలని విజ్ఞప్తిచేశారు.  ప్రతి ఐదుగురిలో ఒకరిని కొవిడ్ బాధితులుగా మనం భావించుకొని మహమ్మారి మరింత ప్రబలకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. డీఆర్డీవో తయారు చేసిన 2-డీజీ యాంటీ కొవిడ్ మందు గేమ్ చేంజర్‌గా నిలిచి సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా గవర్నర్ తన కార్యదర్శి కే సురేంద్రమోహన్ కి సూచించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు కొవిడ్ పరిస్థితులు వ్యాక్సినేషన్ తీరు టెస్టులు పాజిటివ్ కేసులు రికవరీ కేసుల సంఖ్య తదితర అంశాల గురించి సురేంద్రమోహన్ ఈ సందర్భంగా గవర్నర్ కు వివరించారు.