Begin typing your search above and press return to search.

సీఏఏ - ఎన్నార్సీ - ఎన్పీఆర్ లపై మోడీని వివరణ కోరనున్న ట్రంప్!

By:  Tupaki Desk   |   22 Feb 2020 7:30 PM GMT
సీఏఏ - ఎన్నార్సీ - ఎన్పీఆర్ లపై మోడీని వివరణ కోరనున్న ట్రంప్!
X
మరికొద్ది రోజుల్లో అగ్రరాజ్యం అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ .. మొదటి సారిగా భారత్ పర్యటనకి రానున్నారు. దీనితో ఆ పర్యటనకి సంబంధించిన అన్ని ఏర్పాట్లని పూర్తిచేసారు. ఈ పర్యటనకు ట్రంప్ కూడా ఏంటో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్టు ఈ మద్యే ట్రంప్ కూడా మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే , ఈ పర్యటన కోసం ఇరుదేశాల ఇన్వెస్టర్లు కూడా ఎదురు చూస్తున్నారు. ట్రంప్ .. మోడీ భేటీ లో వారు తీసుకోబోయే నిర్ణయాలపై ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఇకపోతే ,ఈ పర్యటనలో ట్రంప్ ..ప్రధాని మోడీని గత కొన్ని రోజులుగా దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ చట్టాలపై వివరణ అడిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలు, విలువల పట్ల అమెరికాకు ఎంతో గౌరవం ఉందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. భారత దేశంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలే కాదు.. మతపరమైన స్వేఛ్చ గురించి కూడా ట్రంప్ ప్రయివేటుగా మోదీతో చర్చించే అవకాశాలున్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మత స్వేఛ్చకు అమెరికా ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆయన గుర్తు చేశారు. ఇండియాలో సీఏఏ మొట్టమొదటిసారిగా మత స్వేఛ్చను 'పరీక్ష'కు పెట్టినట్టు కనిపిస్తోంది.

2015 కు ముందు పొరుగునఉన్న మూడు దేశాల్లో వివక్షను, వేధింపులను ఎదుర్కొని ఇండియాకు తరలివఛ్చిన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించినదే సీఏఏ. అయితే ఇది ముస్లిముల పట్ల వివక్ష చూపేదిగా ఉందని, రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘిస్తోందని విమర్శకులు, ప్రతిపక్షాల వారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ భేటీలో మైనారిటీల హక్కులను పరిరక్షించాలని, ఇతర మతస్థులతో సమానంగా వారిని పరిగణించాలని ట్రంప్.. మోదీని కోరే అవకాశం ఉంది అని , ఎన్నో మతాలకి నిలయం అయిన భారత్ ..ముస్లిమ్స్ కి కూడా తగిన న్యాయం చేస్తుంది అని ఓ అధికారి తెలిపారు.