Begin typing your search above and press return to search.

ట్రంప్ ఓ రాక్షసుడు .. ఎవరు అన్నారంటే !

By:  Tupaki Desk   |   22 Nov 2020 10:50 AM GMT
ట్రంప్ ఓ రాక్షసుడు .. ఎవరు అన్నారంటే !
X
డోనాల్డ్ ట్రంప్ .. అమెరికా అధ్యక్షుడు. అయితే , మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారు. ఎన్నికల్లో ట్రంప్ ఓటమి స్పష్టమైన కూడా , ఆ ఫలితాలపై ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేయడకుండా , ఎక్కడో ఎదో మోసం జరిగింది అంటూ న్యాయస్థానాల్లో దావాలు వేశారు. ట్రంప్ వేసిన పిటిషన్లలో కొన్ని న్యాయస్థానాలు తిరస్కరించాయి. తాజాగా, పెన్సుల్వేనియా కోర్టు ట్రంప్ పిటిషన్ ను తిరస్కరించింది.

ఈ సందర్భంగా ట్రంప్‌ పై న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ను మారే షెల్లీ నవలలో ఫ్రాంకెన్ ‌స్టెయిన్ సృష్టించిన రాక్షసుడు వంటి వ్యక్తని న్యాయమూర్తి మాథ్యూ బ్రాన్ చెప్పారు. అలాగే ఎటువంటి సాక్షాలు లేకుండానే ఊహాజనిత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది మంది పౌరులు మాత్రమే కాకుండా, ఏ వ్యక్తి ఓటు హక్కును హరించే అధికారం ఆయనకు లేదని అన్నారు. దీనిపై ట్రంప్ తరఫున లాయర్ ర్యూడీ గులియనీ మాట్లాడుతూ.. ఇది తమను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని అన్నారు. అంతేకాదు, న్యాయపోరాటంపై తమ వ్యూహాన్ని మార్చుకోడానికి ఈ తీర్పు సహకరిస్తుందని , దీనిని ఫిలడెల్ఫియాలోని మూడో యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌ లో సవాల్ చేయనున్నట్టు తెలిపారు.

ఆ సర్క్యూట్‌ లోని న్యాయమూర్తులలో చాలా మంది ట్రంప్ నామినేట్ చేసివారే ఉన్నారు. మొత్తం నలుగురిని ట్రంప్ నామినేట్ చేశారు.నవంబర్ 9 న దాఖలు చేసిన దావాలో మెయిల్-ఇన్ బ్యాలెట్ల కౌంటీ ఎన్నికల అధికారులు అస్థిరంగా వ్యవహరించారని ట్రంప్ తరఫున లాయర్ ఆరోపించారు. కొన్ని కౌంటీలు ఓటర్లకు రహస్య ఎన్వలప్ ‌లు లేకపోవడం వంటి చిన్న లోపాలను గుర్తించామని , దీనిపై స్పందించిన న్యాయమూర్తి బ్రాన్ ట్రంప్‌ను మారే షెల్లీ నవలలో ఫ్రాంకెన్‌ స్టెయిన్ సృష్టించిన రాక్షసుడు లాంటివాడని వెల్లడించారు.