Begin typing your search above and press return to search.

మోడీని - కేసీఆర్ ను ఫాలో అవుతున్న ట్రంప్!

By:  Tupaki Desk   |   22 May 2020 5:30 PM GMT
మోడీని - కేసీఆర్ ను ఫాలో అవుతున్న ట్రంప్!
X
‘మోడీని - కేసీఆర్ ను ఫాలో అవుతున్న ట్రంప్!’’ ఈ వ్యాఖ్య చూడగానే అందరి దృష్టి అటువైపు మళ్లుతుంది. ఫాలో కావడం అంటే ట్విట్టర్ లో - ఫేస్ బుక్ లో - ఇన్ స్టాగ్రామ్ లో కాదు.. మోడీ - కేసీఆర్ విధానాలనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశ ఎన్నికల్లో తెరపైకి తెస్తున్నారని అర్థం. విద్వేష రాజకీయాలతో గట్టెక్కాలని చూస్తున్నాడు. సెంటిమెంట్ ను రాజేసి ప్రజలను రెచ్చగొట్టి గెలవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఫార్ములా ఇండియాలో వర్కవుట్ అయ్యింది. మరి అమెరికా వర్కవుట్ అవుతుందా? ట్రంప్ కాపీ కొట్టే చాణక్యం పండుతుందా అన్నది ఎన్నికలే నిర్ధేశిస్తాయి..

*మోడీ హిందుత్వ సెంటిమెంట్ తోనే గెలిచారు..

మొన్నటి సార్వత్రిక ఎన్నికల మోడీని గెలిపించింది ‘హిందుత్వ సెంటిమెంట్’ అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ముందు పాకిస్తాన్ పై దాడి.. పైలెట్ అభినందన్ మిస్సింగ్.. అతడిని వెనక్కి తీసుకొచ్చి జాతీయతను తట్టిలేపడంలో మోడీ విజయం సాధించారు. పాక్ పై నిప్పులు చెరిగి హిందుత్వను రెచ్చగొట్టడంతో సక్సెస్ అయ్యారు. అందుకే దేశంలో పేదరికం.. అభివృద్ధి లేమీ ఎంత ఉన్నా మోడీ హిందుత్వ ఎజెండా మీదే పోటీచేసి గెలిచారనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు..

*కేసీఆర్ ది ఆది నుంచి అదే సెంటిమెంట్

కేసీఆర్ పార్టీ టీఆర్ ఎస్ పుట్టుక.. అధికారం వరకు తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే గెలిచారు. మొదటి ఎన్నికల్లో తెలంగాణ వాదంతో రెండోసారి ఆంధ్రా చంద్రబాబు-కాంగ్రెస్ తో పొత్తును హైలెట్ చేసి రాష్ట్రాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద పెడుతారా అని ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి సీఎం అయ్యారు.

*ట్రంప్ ది అదేబాట..

మోడీ - కేసీఆర్ ఇద్దరు సెంటిమెంట్ రాజకీయాలు పండించి ఓట్లు కొల్లగొట్టారు. భారత్ లో ఇది సక్సెస్ ఫుల్ ఫార్ములా అయ్యింది. ప్రజల సెంటిమెంట్ ఎప్పుడూ ఒకేరకంగా ఉంటుంది. భావోద్వేగాలు సేమ్ గా ఉంటాయి. అమెరికా అయినా.. భారత్ అయినా ప్రజల స్పందనలో మార్పు పెద్దగా ఉండదు. ఇప్పుడు అమెరికన్ల సెంటిమెంట్ పై కొట్టేందుకు ట్రంప్ రెడీ అయ్యారు.

*చైనా టార్గెట్.. ప్రతిపక్ష నేతపై ఆరోపణలు

కరోనా అమెరికాలో వ్యాపించడంలో చైనా కుట్ర ఉందని.. చైనా వల్ల అమెరికాలో ఇంత అనర్థం జరుగుతుందని కొద్దికాలంగా విమర్శిస్తున్న ట్రంప్ వచ్చేఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అదే ఎజెండాను నెత్తిన పెట్టుకున్నారు. చైనాను బూచీగా చూపి అమెరికన్లను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకునే ఎత్తుగడ వేశారు. పోయిన సారి అమెరికన్లకే మొదట ఉద్యోగాలని.. విదేశీయులను తరిమి కొడతానని ట్రంప్ ప్రకటించి గెలిచారు. అప్పుడు ఎందరు విమర్శించినా వెనక్కి తగ్గలేదు. ప్రపంచదేశాల నుంచి వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు చైనాను టార్గెట్ చేసి రాజకీయం పండిస్తున్నారు.

తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపించడంతో ఆయన ప్రత్యర్థి అయిన జోబైడెన్ ను ట్రంప్ టార్గెట్ చేశారు. ఇప్పటికే చైనాపై అమెరికన్లలో విషాన్ని నింపుతున్న ట్రంప్.. ఇప్పుడు తాజాగా రూట్ మార్చాడు. తమ దేశ అధ్యక్ష ఎన్నికల్లో చైనా దేశం జోక్యం చేసుకుంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రత్యర్థి - డెమోక్రటిక్ అభ్యర్థి జోసెఫ్ బైడెన్ ను గెలిపించేందుకు చైనా సహకరిస్తోందని సంచలన కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వంపై కావాలని చెడు ప్రచారం చేస్తున్నారని ట్రంప్ నిప్పులు చెరిగారు.

ఇలా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికాలో కరోనాను కంట్రోల్ చేయలేని ట్రంప్ ఆ నెపాన్ని చైనాపై నెట్టి ప్రతిపక్ష నేతను చైనాతో దోస్తీ చేస్తున్నాడని అంటకట్టి గెలిచే ఎత్తుగడను అమలు చేస్తున్నారు. మరి ట్రంప్ వాదనకు అమెరికన్లు సై అంటారా? నై అంటారా అన్నది నవంబర్ లో జరిగే ఎన్నికల్లో తేలనుంది.