Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ను మళ్లీ దెబ్బ తీసింది ఇదే

By:  Tupaki Desk   |   25 Jan 2020 10:59 AM GMT
టీఆర్ఎస్ ను మళ్లీ దెబ్బ తీసింది ఇదే
X
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అస్సలు టీఆర్ఎస్ పార్టీకి పోటీనే ఇవ్వలేదు. ఇచ్చిందల్లా ఒక్కటే అదే. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. కమ్యూనిస్టులకు చెందిన ఈ పార్టీ గుర్తుపైనే టీఆర్ఎస్ రెబల్స్ అంతా పోటీచేసి కారుకు ముచ్చెమటలు పట్టించారు. తెలంగాణ మంత్రి, ధర్మపురి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ను దాదాపు ఓటమి అంచున నిలబెట్టింది ఇదే పార్టీ.. కొప్పుల కేవలం 441ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచారు. ఇక్కడ కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు అభ్యర్థి 13వేల ఓట్లు సాధించడం విశేషం. కారు అనుకొని చాలా మంది ట్రక్కు గుర్తుకు ఓటు వేయడంతో ఈ పరిస్థితి దాపురించింది.

తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ రెబల్స్ కు ఇదే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ దిక్కైంది. కాంగ్రెస్, బీజేపీ ఏమాత్రం పోటీ ఇవ్వకపోగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మాత్రం టీఆర్ఎస్ ను కొన్ని వార్డుల్లో ఓడించి బెంబెలెత్తించడం విశేషం.

మరోసారి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. అందరినీ ఆశ్చర్యపరిచే ఫార్వర్డ్ బ్లాక్ జోగులంబ గడ్వాల్ జిల్లాలోని ఒక పట్టణం అయిన ఐజా లేదా ఐజా మునిసిపాలిటీని గెలుపొందడం విశేషం. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కేవలం ఆరు వార్డులలో గెలిచింది, ఫార్వర్డ్ బ్లాక్ రెండంకెలలో గెలిచి తమ ఆధిపత్యాన్ని చూపించింది.

ఫార్వర్డ్ బ్లాక్ కేవలం ఒక మునిసిపాలిటీని గెలుచుకున్నప్పటికీ, గా తెలంగాణలో ఇది బిజెపి కంటే చాలా పెద్ద విజయం గా చెప్పవచ్చు. ఇది రాష్ట్రంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన నాయకులను కలిగిన బీజేపీ పార్టీ ఈ ఎన్నికల్లో ఎంతో విస్తృతంగా ప్రచారం చేసినా సాధించలేని విజయాన్ని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సాధించడం విశేషం.

టీఆర్ఎస్ కు ధీటుగా రాణిస్తున్న ఫార్వర్డ్ బ్లాక్‌కు ఎవరైనా పెద్ద నేత ప్రాతినిధ్యం వహిస్తే, ఆ పార్టీ ఫేట్ మారిపోనూ వచ్చు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే చాన్స్ కూడా ఉండొచ్చు. కానీ అది కష్టసాధ్యమైంది..చూడాలి మరి ఏం జరుగుతుందో..