Begin typing your search above and press return to search.

మొబైల్​ నంబర్స్​​.. ఇక 11 డిజిట్స్​..!

By:  Tupaki Desk   |   26 Nov 2020 3:45 AM GMT
మొబైల్​ నంబర్స్​​.. ఇక 11 డిజిట్స్​..!
X
ఇప్పటివరకు మన మొబైల్​ నంబర్​ కేవలం 10 అంకెలతో మాత్రమే ఉండేది. అయితే తాజాగా ట్రాయ్​ నిబంధనల ప్రకారం మన మొబైల్​నంబర్​కు మరో అంకె వచ్చి చేరనున్నది. అది అందరికీ కాదు కేవలం ల్యాండ్​ లైన్​నుంచి మొబైల్​కు చేసేవాళ్లకు మాత్రమే. ఇకనుంచి ఎవరైనా ల్యాండ్​ లైన్​ ఫోన్​ నుంచి ఏదన్నా మొబైల్​ నంబర్​కు కాల్​ చేయాలంటే ముందుగా ‘0’ ప్రెస్​ చేసి ఆతర్వాత పది అంకెల మొబైల్​ నంబర్​ను ఎంటర్​ చేయాలి. అప్పుడే కాల్​ పోతుంది.

ఈ మేరకు ట్రాయ్​ ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్తవిధానం అమల్లోకి రానున్నది. అయితే ఈ జీరో యాడ్​ చేయడంపై గతంలో డిపార్ట్​మెంట్​ ఆఫ్​ టెలికాం (డీవోటీ.. టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్​ ఇండియా ( ట్రాయ్​) కు ప్రతిపాదనలు చేసింది. ట్రాయ్​ అంగీకరించడంతో ఈ విధానం అమల్లోకి రానున్నది. అయితే డయిలింగ్ ప్యాట్రన్ మార్పుతో 2,554 మిలియన్ల నెంబర్లు అదనంగా లభించనున్నట్టు రెగ్యులేటర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ విధానం కేవలం ల్యాండ్​లైన్​ నుంచి మొబైల్​ ఫోన్ల కు చేసినప్పుడు మాత్రమే వర్తిస్తుంది.

మొబైల్​ నుంచి ల్యాండ్​ లైన్​కు చేసినప్పుడు.. లేదా మొబైల్​ నుంచి మొబైల్​కు చేసినప్పుడు నంబర్​ కు ముందు జీరో నొక్కాల్సిన అవసరం లేదు. కానీ ల్యాండ్​ లైన్​ నుంచి ల్యాండ్​లైన్​కు చేసినప్పుడు కూడా అవసరం లేదు. కేవలం ల్యాండ్​ లైన్​ నుంచి మొబైల్​ కు కాల్​ చేసేటప్పుడు మాత్రమే పది అంకెల మొబైల్​ నంబర్​ కు ముందు జీరో ను ఎంటర్​ చేయాలి. ఒకవేళ మీరు అలా నొక్కక పోతే వెంటనే మీ మొబైల్​ లో ప్రకటన వస్తుంది. కేవలం భద్రతా విషయాల దృష్ట్యా ఇలా చేసినట్టు సమాచారం.