Begin typing your search above and press return to search.

పట్నం ప్యాక్​ అయ్యింది..ట్రాఫిక్​ జామ్​ రిటర్న్స్​!

By:  Tupaki Desk   |   28 Sep 2020 12:30 AM GMT
పట్నం ప్యాక్​ అయ్యింది..ట్రాఫిక్​ జామ్​ రిటర్న్స్​!
X
కరోనా లాక్ ​డౌన్​ తో వలసకూలీలు - చిరు ఉద్యోగులు హైదరాబాద్​ విడిచిపెట్టి ఊర్లకు వెళ్లిపోవడంతో భాగ్యనగరం మొత్తం ఖాళీఅయ్యింది. ఎటుచూసినా జనాల రద్దీ లేక ట్రాఫిక్​ జామ్​ పూర్తిగా తగ్గింది. అయితే క్రమంగా వలసకూలీలు - చిరుద్యోగులు మళ్లీ ఉపాధి కోసం పట్నం బాటపట్టారు. దీంతో క్రమక్రమంగా హైదరాబాద్​ మళ్లీ పూర్వకళను సంతరించుకుంది. శనివారం హైదరాబాద్​ లో చాన్నాళ్ల తర్వాత మళ్లీ ట్రాఫిక్​జామ్ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ ​లోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్​ జామ్​ తరచూ అవుతోంది.

కరోనా లాక్ ​డౌన్ ​తో పలురంగాలు కుదేలయ్యాయి. టిఫిన్ ​సెంటర్ల యజమానులు - ఫుట్ ​పాత్​ వ్యాపారులు - రోజుకూలీలు - నిర్మాణ రంగ కార్మికులు ఇలా బడుగు జీవులు - చిన్న పాటి ఉద్యోగులు దాదాపు 30 లక్షల మంది హైదరాబాద్​ విడిచిపెట్టి తమ సొంత గ్రామాలకు వెళ్లారని విశ్లేషకులు అంచనా వేశారు. వారు వెళ్లిపోవడంతో హైదరాబాద్​ నగరం బోసిపోయింది. ట్రాఫిక్​ జామ్​ తగ్గిపోయింది. బిజినెస్​ కూడా డల్లయ్యింది. అయితే ప్రభుత్వాలు ప్రస్తుతం లాక్​డౌన్ ​కు సడలింపులు విధించాయి. దీంతో మళ్లీ పలు కంపెనీలు తెరుచుకున్నాయి. దీంతో దినసరి కూలీలు - కార్మికులు - చిరు ఉద్యోగులు తిరిగి పట్నం బాటపట్టారు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్​ లో మళ్లీ ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. ఓ వైపు వర్షం పడుతుండటంతో రోడ్లు చిత్తడిగా మారాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు అయిన ఎల్బీనగర్ - నాగోల్ - ఉప్పల్ - హబ్సీగూడ - ప్యాట్నీ సెంటర్ - బేగంపేట - పంజాగుట్ట - మైత్రీవనమ్ - యూసఫ్ గూడ సర్కిల్ - జూబ్లీ చెక్ పోస్ట్ - హైటెక్ సిటీ - ఖైరతాబాద్ - రవీంధ్ర భారతీ జంక్షన్ - నాంపల్లి - కోటి తదితర కూడళ్లలో ట్రాఫిక్ సమస్య సర్వసాధారణంగా కనిపిస్తోంది. నగరం విడిచిపెట్టి వెళ్లిపోయినవారంతా ఇప్పుడు తిరిగి హైదరాబాద్​కు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.