Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ ఢిల్లీలో కనిపించిందిగా..!

By:  Tupaki Desk   |   9 Oct 2019 10:25 AM GMT
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ ఢిల్లీలో కనిపించిందిగా..!
X
ఏదో అనుకుంటే మరేదో అవుతుందన్న రీతిలో వ్యవహారం మారుతోంది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై సంచలన నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊహించని రీతిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ సంస్థకు చెందిన ఇష్యూ కాస్తా.. రాష్ట్రంలోని మిగిలిన సంఘాలు.. యూనియన్లు మాత్రమే కాదు.. జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్లు సైతం రంగంలోకి దిగుతున్నాయి.

ట్రేడ్ యూనియన్లను రద్దు చేస్తామని.. ఆర్టీసీలో కొత్తగా తీసుకునే ఉద్యోగులు తాము ఏ యూనియన్లలో చేరమంటూ లేఖ రాసి ఇవ్వాలన్న కండీషన్ ను విధించటం తెలిసిందే. కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పు పడుతున్న వారు.. తాజాగా ఊహించని రీతిలో నిర్ణయాన్ని వెల్లడించారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తెలంగాణ భవన్ ముందు ఢిల్లీ ట్రాన్స్ పోర్టు యూనియన్.. ఏఐటీయూసీ నేతలు ధర్నాకు దిగారు. బర్తరఫ్ చేసిన కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసిన వారు.. అరెస్ట్ చేసిన యూనియన్ నాయకుల్ని విడుదల చేయాలని అల్టిమేటం విధించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీని వాడుకున్న కేసీఆర్.. ఇప్పుడు పట్టించుకోవటం లేదంటూ తీవ్ర విమర్శలు చేస్తున్న వారు.. ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో వెంటనేస్పందించాలన్నారు. టీఎస్ఆర్టీసీకి మద్దతుగా దేశంలోని అన్ని ట్రేడ్ యూనియన్లు ధర్నాకు దిగుతాయని వార్నింగ్ ఇచ్చేశారు.

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం అంతకంతకూ ముదిరిపోవటమే కాదు.. దేశ రాజధానిలోని తెలంగాణ భవన్ ఎదుట నిరసన చేసే వరకూ వెళ్లటం చూస్తే.. ఇష్యూ అంతకంతకూ పెద్దదవుతుందని చెప్పక తప్పదు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.