Begin typing your search above and press return to search.

వైసీపీకి గడ్డు కాలం...ఎందుకంటే....?

By:  Tupaki Desk   |   30 Jan 2023 3:00 PM GMT
వైసీపీకి గడ్డు కాలం...ఎందుకంటే....?
X
ఏపీలో అధికార వైసీపీకి ఇబ్బందులు ఉన్నాయి. ముందు ముందు ముసళ్ల పండుగ చూడనున్నారా. పార్టీకి అసలైన గడ్డు కాలం పొంచి ఉందా అంటే పార్టీలోని జనాలు మాత్రం అవును అలాగే ఉంది అని అంటున్నారుట. వైసీపీకి ఏ పార్టీకి దేశంలో లేని విధంగా పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకూ అందరూ వైసీపీ వారే గెలిచారు. అదొక్కటేనా. 151 మంది ఎమ్మెల్యేలు. వారికి మద్దతుగా మరో నలుగురు టీడీపీ నుంచి సపొర్ట్ గా ఈ వైపే వచ్చేశారు. ఇక జనసేన నుంచి నెగ్గిన ఒకే ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీకి జై కొట్టారు. అలా అసెంబ్లీ అంతా వైసీపీ పరచుకుంది.

అదే విధంగా శాసనమండలిలో చూసినా ఫుల్ మెజారిటీతో ఉంది. ఇలా అన్నింటా వైసీపీ అధిపత్యంతో ఉన్నా అంతే స్థాయిలో ఇపుడు అసంతృప్తి కూడా ఉంది అని అంటున్నారు. అదేలా అంటే రెండేళ్ళ క్రితం లోకల్ బాడీస్ నుంచి ఎన్నికైన ఎంపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటుగా కార్పోరేటర్లు, మేయర్లు, మునిసిపాలిటీ చైర్మన్లు, పంచాయతీ సర్పంచులు ఇలా కనుక చూసుకుంటే వారు వీరూ అని కాదు అందరూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు.

ఈ చేదు వార్త నేరుగా సీఎం ఆఫీసుకే చేరింది అని అంటున్నారు. లోకల్ బాడీస్ ద్వారా ఎంతో ఖర్చు పెట్టి ప్రతిష్టకు పోయి నెగ్గి వచ్చిన వారికి ఏ మాత్రం విలువ లేదని, వారంతా జస్ట్ ఉత్సవ విగ్రహాల మాదిరిగానే ఉన్నారని మధనపడుతున్నారుట. అదే నెమ్మదిగా అసంతృప్తిగా మారిందని, ఇపుడు అసమ్మతిగా రూపుదిద్దుకుంటోందని అంటున్నారు. ఏదో ఉన్నామంటే ఉన్నాం, కుర్చీలో కూర్చోవడం తప్ప నిధులు విధులు లేని ఈ పదవులు ఎందుకు అని అంతా మండిపడుతున్నారుట. తమకు ఏ మాత్రం పరపతి పలుకుబడి లేని ఈ పదవులు ఎందుకు అని వారు మండిపోతున్నారుట.

ఇలా కనుక చూసుకుంటే ముందే చెప్పుకున్నట్లుగా పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా వైసీపీకే అన్ని పదవులు అన్నవి ఇపుడు ప్లస్ కాదు మైనస్ గానే మారాయని అంటున్నారు. ఒక విధంగా ఈ అధిక బరువు అధికారం కాస్తా వికటించి వైసీపీకే ఎదురు వచ్చిందని అంటున్నారు. తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అని కూడా వారు ఫైర్ అవుతున్నారుట. ఇలా గ్రాస్ రూట్ లెవెల్ అంటే గ్రామ స్థాయి వరకూ ప్రభుత్వం మీద వ్యతిరేకత భారీ ఎత్తున పరచుకుంది అని అంటున్నారు.

నిజానికి చూస్తే వైసీపీకి వీరంతా ఆయుధాలుగా ఉండాలి. అతి పెద్ద పార్టీ యంత్రాంగంగా ఉండాలి. వీరు ఉంటే చాలు పటిష్టంగా ఉన్నామని వైసీపీ భావించవచ్చు. కానీ సీన్ చూస్తే అలా లేదు. వీరే ఎదురుతిరుగుతున్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఇది మా ప్రభుత్వం కాదు ఇది మా పార్టీ కాదు అని వీరు అనేసుకున్నాక ఇక పార్టీకి ఇబ్బంది కాక మరేమి ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్ చేయాలీ అంటే వీరే ఉండాలి. గ్రామ స్థాయిలో నిలబడి అవతల పక్షాన్ని నిలువరించి వైసీపీకి అనుకూలంగా ఈవీఎం లలో ఓటు వేయించాలి.

కానీ వీరికే ప్రభుత్వం మీఅ పార్టీ మీద విశ్వాసం పోయింది. దాంతో ఇది వైసీపీకి అతి పెద్ద డ్యామేజ్ చేసే వ్యవహారమే అని అంటున్నారు. 2014లో పార్టీ కొత్తగా పెట్టినా తొలి ఎన్నికల్లో పాలుపంచుకున్నపుడు యంత్రాంగం అంటూ ఏమీ లేదు. కానీ నాడు కార్యకర్తలు కసి మీద పోరాడి టీడీపీకి దరిదాపుల్లోకి ఓట్ల షేరింగ్ తెచ్చి పార్టీని ముందు నిలిపారు.

ఇక 2019లో అయితే డూ ఆర్ డై అన్నట్లుగా యుద్ధమే చేసి జగన్ని సీఎం చేశారు. మరి 2024లో చూస్తే అంతా నీరుకారిపోయారు. పోనీ అలా ఉన్నా ఫరవాలేదు కానీ నిప్పులు చిమ్ముతున్నారు. అంటే రేపటి ఎన్నికల్లో ఈ బలం అంతా రివర్స్ అయి అపోజిట్ పార్టీకి కానీ జై కొడితే అపుడు వైసీపీ సంగతేంటి అన్న చర్చ అయితే వస్తోంది. ఏది ఏమైనా లోకల్ బాడీ ఎన్నికల ద్వారా సమకూరిన అతి పెద్ద బలాన్ని వైసీపీ అధినాయకత్వం ఉదాశీన వైఖరితో పోగొట్టుకుంటోందా అన్న చర్చ అయితే వస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.