Begin typing your search above and press return to search.

ప్రపంచానికి ఆ దరిద్రం మన దగ్గరి నుంచే ఎక్కువట

By:  Tupaki Desk   |   4 Aug 2020 7:10 AM GMT
ప్రపంచానికి ఆ దరిద్రం మన దగ్గరి నుంచే ఎక్కువట
X
పిల్లలు దేవుళ్లతో సమానమంటారు. పసి మొగ్గలుగా ఉండే చిన్నారుల్ని చూసినంతనే..కల్మషం లేని వారి నవ్వులు.. ముద్దు ముద్దు మాటలు అలరిస్తాయి. పదేళ్ల లోపు పిల్లల్ని చూసినా..మనసు ఆహ్లాదంగా మారుతుంది. అలాంటిది.. అంత చిన్నారులకు సంబంధించిన అశ్లీల చిత్రాల్ని..వారిపై లైంగిక హింసకు సంబంధించిన చిత్రాల గురించి మాట్లాడటానికి మించిన పాపం మరొకటి ఉండదు. చిన్నారులపై ఛండలామైన సినిమాలకు సంబంధించిన ఒక నివేదిక తాజాగా బయటకు వెల్లడైంది. అందులో విస్తుపోయే అంశాలు ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా చిన్నారుల అశ్లీల చిత్రాల్లో పన్నెండు శాతం భారత్ నుంచే వస్తాయన్న మాట విన్నంతనే నోట మాట రాదంతే. అంటే.. మన దేశంలో చిన్నారుల మీద లైంగిక హింస ఏ స్థాయిలో జరుగుతుందో తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా రోజు పాతిక వేలకు పైగా ఈ తరహా ఛండాలమైన సినిమాల్నిఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తారని చెబుతున్నారు.

ఈ లైంగిక దాడిలో అత్యధికులు అమ్మాయిలే ఎక్కువగా బాధితులు ఉంటారని చెబుతున్నారు. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఇలాంటి వాటికి బలి అవుతున్నారని చెబుతున్నారు. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం 18 ఏళ్ల లోపు బాలికలు ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నారని.. బాధితుల్లో 12 నుంచి 18 ఏళ్ల మధ్య వారు 87 శాతం ఉన్నట్లు చెబుతున్నారు. ఆరేళ్ల నుంచి పదహారేళ్ల వయసులోపు బాలురిలో బాధితులు 41 శాతంగా చెబుతున్నారు. బాధిత బాలురులో 92 శాతం వరకు పదహారేళ్ల లోపు బాలురేనని తెలుస్తోంది. రెండు నుంచి నాలుగేళ్ల లోపు చిన్నారుల్లో ప్రతి నలుగురిలో ముగ్గురుక్రమశిక్షణ పేరుతో.. రెండు నుంచి పదిహేడేళ్ల వయసు లోపు ప్రతి ఇద్దరిలో ఒకరు ఏటా ఏదో ఒక హింసకు గురవుతారని స్పష్టం చేస్తున్నారు. సో.. మీ ఇంట్లో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ..వారిపై ఎప్పుడూ ఒక డేగ కన్ను వేసి ఉండటం వారికి క్షేమం అన్నది మర్చిపోకూడదు.