వీర్యంలో 'వీరత్వం' రావాలంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే..!

Tue Nov 29 2022 12:06:34 GMT+0530 (India Standard Time)

Tips to Increase Quality of Semen

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపించడం లేదు. పౌష్టికాహారానికి బదులుగా జంక్ ఫుడ్స్ కు అలవాటు పడుతుండటంతో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్య మగవారిలో స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం చూపుతుండటంతో సంతానోత్పత్తి సమస్య ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో తండ్రి కావాలనుకునే మగవారి కల నెరవేరడానికి కొందరిలో సమయం చాలా  పడుతుంది. అయితే మగవారి వీర్య వృద్ధి అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆహార అలవాట్లు.. మద్యం.. పొగతాగడం వంటి అలవాట్లు.. వాయు కాలుష్యం.. జన్యుపరమైన సమస్యలు.. మానసిక ఒత్తిడి.. మధుమేహం.. అధిక రక్తపోటు వంటివి ప్రభావం చూపుతున్నాయి.

మనం తీసుకునే ఆహారం.. అలవాట్లు మగవారిలో స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి.. స్పెర్మ్ కౌంట్.. క్వాలిటీ వంటి వాటిని పెంపొందించుకునేందుకు పౌష్టికాహారం తప్పనిసరి వైద్యులు సూచిస్తున్నారు. ఇక కరోనా బారిన పడి కోలుకున్న వారు వీర్య వృద్ధి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సలహా ఇస్తున్నారు.

మగవారి వీర్యంలో వీరత్వంలో రావాలంటే మాత్రం ఆహారంలో వీటిని తప్పసరిగా ఉంచుకోవాల్సిన అవసరముంది. కోడిగుడ్లు.. పాలకూర.. బచ్చలి కూర.. అరటిపండ్లు.. అక్రోట్లు.. గుమ్మడి పలుకులు.. జింక్ పదార్థాలు .. దానిమ్మ.. టమోటాలు.. డార్క్ చాకెట్లు.. వాల్నట్.. ఆస్పరాగస్ వంటి వాటిని మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

కోడి గుడ్డులోని పోషకాలు స్మెర్మ్ కౌంట్ ను పెంచడానికి.. చలనశీలతను మెరుగుపర్చానికి సహకరిస్తాయి. బచ్చలికూరలోని ఫోలిక్ ఆమ్లం అధిక వీర్యవృద్ధికి దోహదపడుతుంది. అరటి పండులోని ఏ.. బీ 1.. సీ.. విటమిన్లు బలమైన స్పెర్మ్ తయారీకి.. ఆస్పరాగస్ లోని సీ విటమిన్స్ స్మెర్మ్ నాణ్యతను మెరుగుపర్చడంతో పాటు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది.

గుమ్మడికాయ గింజలు శరీరంలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. ఈ విత్తనాలలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు రక్త ప్రసరణను మెరుగుపర్చడంతో పాటు వీర్య పరిమాణాన్ని పెంచుతాయి. జింక్ అధికంగా ఉండే బార్లీ.. బీన్స్.. ఎర్ర మాంసం వంటి ఆహారాలు వీర్యకణాల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

జింక్ ఆహారం తీసుకోవడం ద్వారా స్పెర్మ్ చలనశీలత తగ్గి సంతానోత్పత్తి మెరుగవుతుంది. డార్క్ చాక్లెట్ లోని ఎల్ అర్జినిన్ హెచ్‌సిఎల్ అనే అమైనో ఆమ్లం అధిక స్పెర్మ్ గణనలు.. వాల్యూమ్‌కు దోహదం చేస్తుంది. పరిమిత పరిమాణంలో వినియోగంతో స్పెర్మ్ సంఖ్యను మెరుగుపరుస్తుంది.

వాల్నట్స్ కొవ్వులు.. ప్రోటీన్లకు మూలం. వీర్యంలో వీరత్వం పెరగానికి వాల్నట్ లోని అర్జినిన్ కంటెంట్ దోహదపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రసరణను సైతం మెరుగుపరుస్తాయి. ఈ ఆహార పదార్థాలను మగవారు తమ డైట్ లో చేర్చుకుంటే సరైన ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.