Begin typing your search above and press return to search.

టిక్ టాక్ కు అల్టర్ నేట్.. హైదరాబాద్ యాప్ దూకుడు

By:  Tupaki Desk   |   5 July 2020 4:30 PM GMT
టిక్ టాక్ కు అల్టర్ నేట్.. హైదరాబాద్ యాప్ దూకుడు
X
కొన్ని అలవాట్లు జీవితంలో భాగమైపోతాయి. అలాంటిదే టిక్ టాక్. కొన్నేళ్లుగా నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ తరచూ టిక్ టాక్ చూడటం.. నచ్చింది షేర్ చేయటమే కాదు.. టిక్ టాక్ లో వీడియోలు అప్ లోడ్ చేసేవారు పిచ్చబోలెడుమంది. ఈ ప్లాట్ ఫాం పుణ్యమా అని వేలాది మంది టిక్ టాక్ స్టార్లుగా అవతరించారు. భద్రతా సమస్యల నేపథ్యంలో భారత సర్కారు 59 చైనా యాప్ లను బ్యాన్ చేయగా.. అందులో టిక్ టాక్ ఒకటన్న విషయం తెలిసిందే. లక్షల్లో.. వేలల్లో ఫాలోయర్స్ ఉన్న ఎందరో టిక్ టాక్ స్టార్లు.. బ్యాన్ నేపథ్యంలో చేతులు కట్టేసినట్లైంది. అయితే.. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావటంతో.. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఆ ప్లాట్ ఫాం మీద కాకపోతే.. మరో దానిలో తామేమిటో ఫ్రూవ్ చేసుకుంటామని చెబుతున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన ఒక సంస్థ రూపొందించిన ‘‘డబ్ షూట్’’ ఇప్పుడు ఆదరణ చెందుతోంది. ఎం టచ్ అనే హైదరాబాదీ సంస్థ డెవలప్ చేసిన ఈ యాప్.. గూగుల్ ప్లే స్టోరీలో ఫేవరేట్ యాప్ గా మారినట్లుగా చెప్పాలి. టిక్ టాక్ బ్యాన్ తర్వాత ఈ యాప్ కు డౌన్ లోడ్ లు బాగా పెరిగాయి.

ఈ యాప్ లో బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్.. మల్లువుడ్ సినిమాల క్లిప్పింగ్స్.. ఫన్నీ డైలాగ్స్ లాంటివి ఉంటాయి. ఇందులో ఆడియో క్లిప్ ను వాట్సాప్ లో షేర్ చేసుకునే వెసులుబాటుతో పాటు..వీడియో స్టేటస్ పెట్టుకోవచ్చు. సెల్పీ వీడియోను రికార్డుచేసి దానికి వివిధ రకాల సౌండ్స్.. డైలాగుల్ని.. ఫేమస్ యాక్టర్స్ హావభావాలతో మిక్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. మొత్తంగా టిక్ టాక్ బ్యాన్ తర్వాత తమ టాలెంట్ ఫ్రూవ్ చేసే వేదిక కోసం ఎదురుచూస్తున్న ఎంతోమందికి డబ్ షూట్ సమాధానం అవుతుందని చెబుతున్నారు. ఎందుకు ఆలస్యం.. ఒక లుక్ వేయండి.