టిక్ టాక్ కు పాపులర్ తెలుగమ్మాయి బలి

Thu Sep 12 2019 15:06:48 GMT+0530 (IST)

Tik Tok Star Sonika kethavath Death During Bike Accident

టెక్నాలజీని మంచిగా వాడితే ఒక్కరోజులోనే స్టార్ లు అయిపోతాం. అదే చెడుకు వాడితే అదే రోజున అంతర్జానమైపోతాం. ఇప్పుడు తెలుగు టిక్ టాక్ - యూట్యూబ్ స్టార్ గా పేరుతెచ్చుకున్న వైజాగ్ అమ్మాయి విషాధాంతం అందరినీ కలిచివేస్తోంది.టిక్ టాక్ వీడియోలు - యూట్యూబ్ లో పాపులర్ అయిన సోనికా కేతావత్ గురించి సోషల్ మీడియాలో తెలియని వారుండరు. టిక్ టాక్ ఉప్పల్ బాలు వలే ఈ వైజాగ్ బీటెక్ అమ్మాయి సోనికా కూడా తన క్యూట్ అందమైన వీడియోలతో సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యింది. ఈమెకు టిక్ టాక్ లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సెలబ్రెటీగా మారిన ఈ అమ్మాయిని సినిమాల్లోకి రావాలని చాలా మంది ఆహ్వానించారు కూడా.  

బైక్ రైడింగ్ అంటే సోనికాకు చాలా ఇష్టం. ఇటీవల స్నేహితులతో కలిసి వెళుతుండగా బైక్ రౌడింగ్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేసింది. ఈ వీడియో తీస్తుండగానే నల్గొండ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా బైక్ రైడ్ చేస్తూ ఎదురుగా వచ్చిన సైకిల్ ను తప్పించబోయి వీరు ద్విచక్రవాహనంతో చెట్టును ఢీకొట్టారు.

గాయపడ్డ సోనికాను ఆస్పత్రికి తరలించారు. చిన్న చిన్నగాయాలే తగ్గిపోతాయని అంతా భావించారు. కానీ తాజాగా శరీరంలో బలమైన గాయాలు అయ్యి రక్తస్రావం జరిగి పరిస్థితి విషమించి ఈ టిక్ టాక్ స్టార్ ప్రాణాలు విడిచినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఆమె స్నేహితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈమె మరణ వార్త తెలిసి సోషల్ మీడియాలో సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇలా టిక్ టాక్ తో పాపులర్ అయిన సోనికా.. ఆ టిక్ టాక్ పిచ్చిలోనే వీడియో చేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవడం విషాదం నింపింది.