Begin typing your search above and press return to search.

థ్రిల్లింగ్ మిస్టరీ: చెంచాలతో కన్నం వేసి ఖైదీలు పరార్

By:  Tupaki Desk   |   25 May 2020 2:30 AM GMT
థ్రిల్లింగ్ మిస్టరీ: చెంచాలతో కన్నం వేసి ఖైదీలు పరార్
X
చుట్టూ సముద్రం.. మధ్యలో దీవి. అందులో ఎత్తైన గోడలు గల అతిపెద్ద జైలు. భారీ సెక్యూరిటీ.. నిత్యం నిఘా నీడ.. అయినా ఆ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరారయ్యారు. వేటితో అంటే కేవలం చెంచాలు ఉపయోగించి గోడకు కన్నాలు వేసి పరారయ్యారు. ఐదు దశాబ్ధాల కిందట జరిగిన ఈ అద్భుతం ఇప్పటికీ మిస్టరీగా ఉంది.

ఆ జైలు నుంచి తప్పించుకున్న ఓ ఖైదీ పేరుతో 2013లో వచ్చిన ఓ లేఖతో ప్రపంచవ్యాప్తంగా ఈ మిస్టరీపై ఆసక్తి నెలకొంది.

సముద్రం మధ్యలోని ఈ దీవిలో నరకయాతన అనుభవించలేక ఎంతో మంది ఖైదీలు పారిపోవడానికి ప్రయత్నించి జైలు సిబ్బంది తూటాలకు బలయ్యారు. మరికొందరు సముద్రంలో దుంకి చనిపోయారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని అండమాన్ జైల్లో వేసినట్టు ఇక్కడ కూడా సముద్రంలోని దీవిలో కరుడుగట్టిన ఖైదీలను ఉంచారు. కానీ అక్కడి నుంచి తప్పించుకున్నారు. ప్రపంచ చరిత్రలోనే గ్రేట్ ఎస్కేప్ గా ఇది నమోదైంది.

అగ్రరాజ్యం అమెరికాలోనే అత్యంత భద్రత కలిగిన జైలుగా శాన్ ప్రాన్సిస్కో సముద్ర తీరానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో గల ‘ఆల్కాట్రాజ్’ ద్వీపంలోని జైలుకు పేరుంది. ఈ జైలును ‘ది రాక్’ అనే వారు..చుట్టు సముద్రం ఉండడం వల్ల ఖైదీలు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు. కానీ 1962, జూన్ 11న అర్ధరాత్రి ముగ్గురు ఖైదీలు చాలా తెలివిగా తప్పించుకొని చరిత్ర సృష్టించారు.

ఫ్రాంక్లీన్ మోరీస్, జాన్ అంగ్లిన్, క్లారెన్స్ అంగ్లిన్ అనే ముగ్గురు ఆ జైలు నుంచి తప్పించుకొని ప్రపంచ చరిత్రలోనే గ్రేట్ ఎస్కేప్ గా మలిచారు. ఫ్రాంక్లిన్ చిన్ని నేరాలు - మోసాలతో బాల్యం నుంచే దొంగతనాలు చేసేవాడు.. ఇక జాన్ అంగ్లిన్ - క్లారెన్స్ అంగ్లిన్ ఇద్దరూ సోదరులు.. వీరు కూడా ఆర్థిక ఇబ్బందులతో వలసపోయి దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఫ్రాంక్లీన్ - అంగ్లీన్ సోదరులకు పదేళ్ల జైలు శిక్ష పడడంతో తరచూ తప్పించుకుంటున్న వీరిని అట్లాంటా - లూసియినా జైల్లలో వేస్తే తప్పించుకోవడానికి ప్రయత్నించి పోలీసులకు దొరికారు. దీంతో ఈ ముగ్గురిని తప్పించుకోవడానికి అవకాశం లేని సముద్రం మధ్యలో ఉన్న అల్కాట్రాజ్ ద్వీపంలోని జైలుకు తరలించారు. అక్కడ వారికి ఘరానా దొంగ అలెన్ వెస్ట్ అనే ఖైదీతో పరిచయం ఏర్పడింది. నలుగురిని ఒకే జైలు గదిలో ఉంచడంతో వీరు తప్పించుకునే ప్లాన్ చేశారు.

చెంచాలు - వాడి పడేసిన రంపపు బ్లేడులను సేకరించి ఈ నలుగురు వెంటిలేషన్ కోసం ఏర్పాటు చేసిన కిటీకీని తొలగించి దాని ద్వారా బయటపడ్డారు. జైల్లో దొరికిన ప్రతీ లోహం వస్తువును పనిముట్లుగా మలిచి స్కెచ్ గీశారు. గోడకు రంద్రాలు చేస్తూ వెంటిలేటర్ పెకిలించారు. శబ్ధాలు రాకుండా జైల్లో వేసే మ్యూజిక్ హవర్ అప్పుడే వారు గోడను తవ్వడం మొదలు పెట్టేవారు.

ఇక తప్పించుకున్నాక సముద్రం దాటడం ఎలా అని ఆలోచించి సైనికుల రెయిన్ కోట్ల తయారీకి తెచ్చిన వాటర్ ఫ్రూఫ్ షీట్లను భద్రతా సిబ్బంది కళ్లుగప్పి సెల్ లోకి తెచ్చేవారు. లైఫ్ జాకెట్లుగా కుట్టి భద్రపరిచారు. చివరకు ఓ రోజు వెంటిలేటర్ తొలగించి జాకెట్లతో పరారయ్యారు. రాత్రివేళ లైట్లు ఆపేసే జీరో ఆవర్ లో ఫ్రాంక్, అంగ్లిన్ సోదరులు తప్పించుకున్నారు. కానీ వెస్ట్ మాత్రం ఆ చిన్న రంద్రంలో పట్టలేక లావుగా ఉండడంతో తప్పించుకోలేకపోయాడు. అతడిని లాగినా రాలేకపోవడంతో అతడిని వదిలి ఈ ముగ్గురు పారిపోయారు. ఆ తరువాత వెస్ట్ ను విచారించగా ఈ గ్రేట్ ఎస్కేప్ ప్లాన్ వివరించాడు. ముగ్గురు లైఫ్ జాకెట్లతో సముద్రంలో 3 కి.మీలు ఈది తప్పించుకున్నారు. అయితే జైలు అధికారులు సముద్రం అంతా వెతికి వాళ్లు చనిపోయారని పేర్కొన్నారు. కానీ 2013లో మేం బతికే ఉన్నామని వాల్లు లేఖ రాయడంతో పోలీసుల పరువు పోయింది. ప్రపంచంలోనే ‘గ్రేట్ ఎస్కేప్’గా ఇది చరిత్రలో నిలిచిపోయింది.