Begin typing your search above and press return to search.

ఢిల్లీలో దారుణం: ముగ్గురు మైనర్లను కిడ్నాప్ చేసి రేప్ చేశాడు

By:  Tupaki Desk   |   13 Aug 2022 6:42 AM GMT
ఢిల్లీలో దారుణం: ముగ్గురు మైనర్లను కిడ్నాప్ చేసి రేప్ చేశాడు
X
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది.కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. మహిళల రక్షణ గురించి ప్రభుత్వాలు చెప్పే మాటలకు.. చోటు చేసుకుంటున్న ఉదంతాలకు సంబంధం లేని రీతిలో పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి. తాజాగా ఒక కామాంధుడు మైనర్ బాలికలకు మంచి మాటలు చెప్పి నమ్మించి.. వారికి మత్తు మందు కలిపిన కూల్ డ్రింకులు ఇచ్చి.. వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ షాకింగ్ ఉదంతానికి సంబంధించి పోలీసులు చెబుతున్న వివరాల్ని చూస్తే.. ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు ముంబయికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఆగస్టు 6న వారు న్యూఢిల్లీ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ వారికి ఒక అపరిచిత వ్యక్తి కలిశాడు. రైల్వే టికెట్లు బుక్ చేస్తానని వారిని నమ్మించాడు. టికెట్లు సిద్ధమయ్యే వరకు ఉండాలంటూ ఒక ఇంటికి తీసుకెళ్లాడు.

ఆ ఇంట్లో మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. కొంతసేపటి తర్వాత మైనర్లకు మంచి మాటలు చెప్పి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. అవేమీ తెలీని మైనర్లు కూల్ డ్రింగ్ తాగేసి.. మత్తులోకి జారిపోయారు.

అనంతరం ఈ ముగ్గురు మైనర్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వారికి తెలివి వచ్చిన తర్వాత జరిగింది అర్థమైంది. తమను ముంబయి పంపాలని గట్టిగా కోరితే.. సదరు నిందితుడు ముగ్గురు మైనర్లను పెళ్లాడతానని చెప్పాడు. దీంతో తాము మోసపోయిన విషయాన్ని తెలుసుకున్న ముగ్గురు మైనర్ బాలికలు..నిందితుడి బారి నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకున్నారు. తమకు జరిగిన ఘోరం కుటుంబ సభ్యులతో చెప్పారు. దీంతో బాధిత మైనర్ బాలికలకు జరిగిన అన్యాయంపై కేసు నమోదైంది.

బాధిత మైనర్ బాలికలపై నిందితుడు అత్యాచారం జరిపినట్లుగా గుర్తించారు. అంతేకాదు.. అతడి గత చరిత్రను తవ్వి తీశారు. అతడిపై గతంలోనూ అమ్మాయిల్ని లైంగిక వేధింపులకుగురి చేసిన చరిత్ర ఉన్నట్లుగా తేల్చారు. ఈ నేపథ్యంలో అతడితో పాటు. మైనర్ బాలికల్ని ఉంచిన ఇంట్లోని మహిళలను సైతం పోలీసులు అరెస్టు చేశారు.

ముగ్గురు మైనర్ బాలికల్ని అత్యాచారం చేసిన నిందితుడు ప్రకాశ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. తాము అదుపులోకి తీసుకున్న ముగ్గురు మహిళలను రిమాండ్ కు తరలించారు. ఈ ఉదంతంపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మిలివార్ సీరియస్ అయ్యారు. ఆగస్టు 14 లోపు అతడిని పట్టుకోవాలని.. అతడిపై చర్యలు ఏం తీసుకున్నారో తమకు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. దీంతో.. ఈ నిందితుడ్ని పట్టుకోవటం ఢిల్లీ పోలీసులకు పెద్ద పనిలా మారింది.