12 రోజుల్లో బెంగాలీ నటీమణులు ముగ్గురు సూసైడ్

Sun May 29 2022 05:00:02 GMT+0530 (IST)

Three Bengali actresses commit suicide in 12 days

గడిచిన నెల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఐదుగురు మహిళా నటీమణులు ఆత్మహత్యలు చేసుకోవటం షాకింగ్ గా మారింది. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ఆ ఐదుగురిలో ముగ్గురు బెంగాల్ చిత్ర పరిశ్రమకు చెందిన వారే కావటం గమనార్హం. కేవలం పన్నెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు బెంగాలీ నటీమణులు బలవన్మరణం చెందటం కలకలాన్ని రేపుతోంది.శుక్రవారం ఉదయం యువ నటి..మోడల్ మంజూషా కోల్ కతాలోని తన అపార్ట మెంట్ లో ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తించారు. ఆమె మరణానికి కారణం.. తనకు ఎంతో అప్త మిత్రురాలైన మరో నటి బిదిషా మజుందార్ బుధవారం ఆత్మహత్య చేసుకోవటమే కారణమని చెబుతున్నారు. మే 15న మరో బెంగాలీ నటి పల్లవి డే ఆత్మహత్య చేసుకున్న వైనం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతోనే ఆమె మరణించినట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు బెంగాలీ నటీమణులు ఆత్మహత్య చేసుకోవటం.. వారి మరణానికి వారి మధ్యనున్న 'స్నేహం' కారణమన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా బిదిషా తల్లి మాటలు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయని చెప్పాలి.

బుధవారం ఉదయం నటి బిదిషా కోల్ కతాలోని తన అపార్ట్ మెంట్ ఉరి వేసుకొని మరణించటం తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకోవటాన్ని జీర్ణించుకోలేని ఆమె సన్నిహిత స్నేహితురాలు మంజుషా శుక్రవారం సూసైడ్ చేసుకున్నారు.

బిదిషా.. మంజూషాలు ఇద్దరు ఎంతో సన్నిహితంగా ఉండేవారని.. వారిద్దరూ కలిసి జీవితాంతం కలిసి ఉండాలని కోరుకున్నారని.. అయితే.. ఇరు కటుంబాల్లోని వారు వారి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించటంతో..  తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా బుధవారం బిదిషా మజుందార్ ఆత్మహత్య చేసుకోగా.. స్నేహితురాలి ఆత్మహత్యను జీర్ణించుకోలేని మంజుషా తాజాగా సూసైడ్ చేసుకోన్నారు. వీరిద్దరి ఆత్మహత్యలు బెంగాల్ చిత్ర పరిశ్రమకు షాకింగ్ గా మారాయి. వీరి మరణాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు తెర తీసే అవకాశం ఉందని చెప్పొచ్చు.