ఆ బాంబు పెట్టింది మేమే.. ముకేశ్ నీకు ముందు ముందు సినిమా చూపిస్తాం..!

Sun Feb 28 2021 22:00:02 GMT+0530 (IST)

Threat to Ambani's life Explosives near home

ఇటీవల ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలోని ఓ వాహనంలో గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలు ఉంచిన విషయం తెలసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఆ పేలుడు పదార్థాలను పెట్టింది మేమే నంటూ జైష్-ఉల్-హింద్ అనే సంస్థ ప్రకటించింది. 'వాహనంలో పేలుడు పదార్థం పెట్టింది మేమే. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ముందు ముందు సినిమా చూపిస్తాం' అంటూ సందరు సంస్థ ఓ మెసేజ్ను పంపించింది. ఈ మెసేజ్ను టెలిగ్రామ్ యాప్లో పంపించడం గమనార్హం.



బిట్ కాయిన్ ద్వారా మాకు డబ్బులు చెల్లించాలని సదరు సంస్థ డిమాండ్ చేసింది. అంబానీ ఇంటివద్ద అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్న వాహనాన్ని పోలీసులు గురువారం గుర్తించారు.  కాగా మీరు ఆపగలిగితే మమ్మల్ని ఆపండి..అని కూడా ఈ సంస్థ పోలీసులకు సవాల్ విసిరింది.ఇటీవల అంబానీ ఇంటి సమీపంలోని ఓ వాహనంలో జిలెటెన్ స్టిక్స్ కనిపించాయి. ఈ వాహనాన్ని పోలీసులు గురువారం గుర్తించారు.

అయితే ఈ ఘటనకుపాల్పడింది తామేనంటూ ఓ ఉగ్రవాద సంస్థ ప్రకటించడం సంచలనంగా మారింది. అల్లాను నమ్మనివాళ్లకు శిక్ష తప్పదంటూ సదరు సంస్థ హెచ్చరించింది. ప్రముఖ వ్యాపారవేత్త అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలు బయటపడటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.