Begin typing your search above and press return to search.

ఆ రెండు ఆలయాలే నెక్స్ట్ టార్గెట్ : ఎమ్మెల్యే రాజాసింగ్

By:  Tupaki Desk   |   3 Aug 2020 9:30 AM GMT
ఆ రెండు ఆలయాలే నెక్స్ట్ టార్గెట్ : ఎమ్మెల్యే రాజాసింగ్
X
ఆగస్ట్ 5 .. భారతదేశం చరిత్రలో ఈ రోజు చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమయం కేవలం మరికొన్ని రోజుల్లోనే రాబోతుంది. ఆగస్టు 5 న అయోధ్య లో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ చేయబోతున్నారు. ఈ క్రార్యక్రమం చాలా అట్టహాసంగా , అతి కొద్ది మంది సమక్షంలో జరగబోతుంది. తాజాగా ఈ వ్యవహారం పై ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ..అయోధ్యలో రామమందిరం నిర్మిస్తాం అని మేము ఎప్పుడో చెప్పామని ..వాటిని ఇప్పుడు ఆచరణలో పెట్టి చూపించాం అని చెప్పారు.

అయోధ్యలో అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మిస్తామని చెప్పామని... ఆ మాటను నిలబెట్టుకున్నామని , అలాగే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ లను రద్దు చేశామని చెప్పారు. అలాగే దేశంలో అభివృద్ధి పనులతో ముందుకుపోతున్నట్టు తెలిపారు. అయితే , రామమందిర భూమి పూజకి ప్రధాని మోడీ హాజరు కాబోతుండటం పై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకి రాజాసింగ్ సమాధానం ఇచ్చాడు. అయోధ్య భూమి పూజకు ప్రధాని మోదీ హాజరు కావడంలో ఏ తప్పూ లేదని ,ఈ దేశంలో హిందువులు కూడా భాగమేనని, వారి గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉందని ఆయన చెప్పారు.

ఇక, ఇప్పటితో రామ మందిర ఉద్యమం ముగిసిందని, త్వరలోనే అక్కడ పూజలు కూడా ప్రారంభమవుతాయని అన్నారు . అలాగే మా తదుపరి లక్ష్యం మథుర, వారణాసి దేవాలయాలే అంటూ సంచలన ప్రకటన చేశారు. ఆ రెండు దేవాలయాల గురించి కూడా న్యాయపోరాటం చేసి గెలుస్తామని చెప్పారు. ఆ దేవాలయాల నిర్మాణం కూడా బీజేపీ హయాంలో జరుగుతుందని తెలిపారు. ఆ రెండు దేవాలయాల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని... కోర్టులో విజయం సాధిస్తామని చెప్పారు.