Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ పోటీలో ముందున్నవి ఆ మూడు కంపెనీలేనట

By:  Tupaki Desk   |   12 July 2020 9:30 AM GMT
వ్యాక్సిన్ పోటీలో ముందున్నవి ఆ మూడు కంపెనీలేనట
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారికి చెక్ చెప్పేందుకు వీలుగా వ్యాక్సిన్ తయారీ ప్రయోగాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఏ దేశానికి ఆ దేశం వ్యాక్సిన్ తయారీలో తమదే పైచేయి కావాలన్నట్లుగా వ్యవహరిస్తోంది. దీని మీద పని చేస్తున్న కంపెనీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఎవరైతే మొదటగా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెడతారో.. ఆ కంపెనీ స్థాయి రాత్రికి రాత్రి మారిపోవటం ఖాయమని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే భారత్ బయోటెక్ సంస్థ పంద్రాగస్టుకు వ్యాక్సిన్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నా.. అదేమీ సాధ్యం కాదని.. దసరాకు రావటం కష్టమేనని తేలుస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది చివరకుకానీ.. వచ్చే ఏడాది మొదట్లో కానీ వచ్చే వీలుంది. ఇదిలా ఉంటే.. వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయోగంలో ప్రస్తుతానికి ఫైనల్ కు వచ్చిన కంపెనీలుగా మూడు మాత్రమే మిగిలాయి.

అందులో బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ వర్సిటీ తయారు చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. అమెరికాకు చెందిన బయోటెక్ సంస్థ గిలియాడ్ సైన్సెస్.. మాడెర్నా కూడా క్లీనికల్ ట్రయల్స్ ను స్పీడ్ పెంచాయి. కరోనా మరణాల్ని యాంటీ వైరల్డ్రగ్ రెమెడిసివిర్ ఉపయోగించటం వల్ల మరణాల అంచుల్లో ఉన్న వారిని కాపాడుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. త్రీవమైన వైరస్ లక్షణాలుఉన్న వారికిఈ మెడిసిన్ వాడొచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉంటే..వ్యాక్సిన్ తయారీలో కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో ఎవరికి వారు త్వరలోనే తమ వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుందనిచెబుతున్నారు.
జర్మనీకి చెందిన బయోఎన్ టెక్ సే కంపెనీ తమ వ్యాక్సిన ఈ ఏడాది చివరకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. తాముతయారుచేసిన వ్యాక్సిన్ ప్రాథమిక దశలో అద్భుత ఫలితాల్ని ఇచ్చిందని చెప్పారు. దాదాపు 30 వేల మందిపై తాము ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే మార్కెట్లోకి తేనున్నట్లు స్పష్టం చేశారు. మరీ.. ముగ్గురి మధ్య పోటీలో అంతిమంగా ఎవరు మొదట వ్యాక్సిన్ విడుదల చేస్తారన్న దానిపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొందని చెప్పక తప్పదు.