ఆ జిల్లాలే జనసేనకు ఆయువు పట్టు.. వ్యూహమే కీలకం

Fri Sep 30 2022 17:00:01 GMT+0530 (India Standard Time)

Those districts are the lifeline of jana sena.. Strategy is the key

ఔను.. రేపో మాపో.. పార్టీ నేతలతో వ్యూహ భేటీలు(స్ట్రాటజీ కమిటీ మీటింగ్) నిర్వహించేందుకు రెడీ అ య్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమేధ్యేయంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అందరినీ ఏకం చేయడం.. పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపించేలా వ్యవహరించడం.. ఇప్పుడు.. జనసేన ప్రధానకర్తవ్యంగా ఉందని తెలుస్తోంది. పవన్ నిర్వహించనున్న ఈ సమావేశాల్లో అజెండా కూడా ఇదే!అయితే.. ఇక్కడ పవన్ గమనించాల్సిన కొన్ని అంశాలను మేధావులు సూచిస్తున్నారు. ఏకమొత్తంగా.. రాష్ట్రాన్ని చూడవద్దని.. రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే ఉంది కనుక..పార్టీని పుంజు కునేలా చేయాలంటే..బలమైన జిల్లాలుగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుని.. ముందుకు సాగడం కీలకమని చెబుతున్నారు.  సీమను తీసుకుంటే.. నాలుగు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. అయితే.. ఆయా జిల్లాల్లో జనసేన బలం.. రెండు జిల్లాల్లోనే ఉంది. ఒకటి అనంతపురం రెండు కర్నూలు.

అదేవిధంగా.. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లోనూ.. కేవలం శ్రీకాకుళం.. విశాఖల్లో మాత్రమే జనసేన బలం కనిపిస్తోంది. ఇక కోస్తాకు వచ్చే సరికి మాత్రం ఒకింత భిన్నమైన వాతావరణం ఉంది. విజయవాడలో బలం కనిపిస్తున్నా.. జిల్లాకు వచ్చేసరికి మాత్రం కొంత తాడా ఉంది. ఈ నేపథ్యంలో ముందు.. జనసేన బలాన్ని అంచనా వేయడం.. అత్యంత కీలకం. ఆ తర్వాత.. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లా లనే విషయంపై.. దృష్టి పెట్టాలని అంటున్నారు.

ఇక కొన్ని జిల్లాల్లో.. మరో చిక్కు కూడా కనిపిస్తోంది. అదేంటంటే.. జనసేన బలంగా ఉన్న చోట్ల.. టీడీపీ ఓటు బ్యాంకుపై ప్రభావం పడే అవకాశం ఉందని.. అంటున్నారు. ఎందుకంటే.. టీడీపీలోని తటస్థ ఓటు బ్యాంకు.. ఇప్పుడు జనసేనవైపు చూస్తోందని తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో వీరి ఓట్లు టీడీపీకి పడలేదని.. ఒక అంచనా ఉంది. వీరిని ఏకం చేసేందుకు.. టీడీపీ అధినేత ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు తటస్థ ఓటు బ్యాంకుగా ఉన్న వీరు.. స్థానిక నేతలకు మధ్య వివాదాలు అలానే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వారు.. జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఏది చేసినా.. బలం బలగం ఉన్న జిల్లాలపై ప్రధానంగా దృష్టి పెడితే మంచిదని చెబుతున్నారు పరిశీలకులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.