Begin typing your search above and press return to search.

కరోనా : ఆ 126 రకాల జంతు జాతులు..ఈ వైరస్ లను వ్యాప్తిచేస్తాయట!

By:  Tupaki Desk   |   22 Feb 2021 9:30 AM GMT
కరోనా : ఆ 126 రకాల జంతు జాతులు..ఈ వైరస్  లను వ్యాప్తిచేస్తాయట!
X
పలు రకాల జంతువులు విభిన్నమైన కరోనా ను వ్యాపించచేయగలవని తాజాగా చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. క్షీరదాల వంటి జాతుల్లో భిన్నమైన కరోనా వైరస్ లు వ్యాప్తి చేయగలవు. అందులో SARS-COV-2 కూడా ఉందని తేలింది. వీటి నుంచి మరిన్ని కొత్త కరోనా వైరస్ లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటివరకూ సైంటిస్టులు అనేక రకాల జంతు జాతులపై అధ్యయనం చేశారు. కొత్త కరోనా వైరస్ లు వందలాది జంతు జాతులు కరోనావైరస్ కలిగి ఉంటాయని అధ్యయనం సూచిస్తోంది.

కరోనా వైరస్ అనేది అతిపెద్ద వైరస్ ల సమూహంగా చెప్పవచ్చు. మనుషుల్లో వ్యాపించే కరోనా వైరస్ లు కేవలం ఏడు మాత్రమే తెలుసు. అందులో SARS-COV - MERS-COV - SARS-COV-2 సహా అన్ని కరోనా వైరస్ లు తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులే కానీ - కరోనా వైరస్ లు జంతువుల్లో చాలా వేగంగా వ్యాపించగలదు. ఇప్పటికే ఈ జంతు జాతుల్లో వందలాది ఏకైక స్ట్రెయిన్ కలిగిన వైరస్ లను గుర్తించారు. కొన్ని జంతువుల్లో ఒకే సమయంలో భిన్నమైన కరోనా వైరస్ లు వ్యాపిస్తాయి. భిన్నరకాల వైరస్ లన్నీ కలిసి కొత్త వైరస్‌ లుగా రూపాంతరం చెందగలవు. వాటినే కొత్త కరోనా వైరస్ లు అని పిలుస్తారు.

SARS-COV-2 అనే కొత్త కరోనా వైరస్ కూడా కరోనా అనే వ్యాధిని వ్యాపింపచేయగలదు. జెన్ బ్యాంకు డేటా ఆధారంగా 876 క్షీరద జాతి జంతువుల్లోని 411 కరోనా వైరస్ లతో పోల్చి చూశారు. అవన్నీ కరోనా వైరస్ లను కలిగి ఉన్నాయని వెల్లడైంది. ఒక్కో కరోనా ప్రతి కరోనా వైరస్ జాతులు సగటున 12 కంటే ఎక్కువ రకాల క్షీరద హోస్ట్‌ లకు సోకుతాయని మోడల్ అంచనా వేసింది. ప్రతి క్షీరద వాహకం సుమారు ఐదు రకాల కరోనా వైరస్ లను సంక్రమించవచ్చుననితేలింది. దేశీయ పందిలో వైరస్ వ్యాప్తికి అధిక ప్రమాదాన్ని కలిగిస్తుందని అధ్యయనం పేర్కొంది.