యుద్ధం ఎంత భయంకరం గా ఉంటుందో చెప్పే ఒక్క ఫోటో

Wed Oct 27 2021 09:54:43 GMT+0530 (IST)

This photo tells about the situation in Syria

వేల మాటలు చెప్ప లేని విషయాన్ని.. సరైన ఫోటో ఒక్కటి చెప్పేస్తుంది. ప్రపంచాన్ని అమితం గా ప్రభావితం చేసే శక్తి పదాలు.. మాటల కన్నా ఎక్కువ గా ఫోటోకు ఉంటుంది. ఎన్నో సందర్భా ల్లో ఈ విషయం రుజువైంది కూడా. తాజాగా అలాంటి ఒక ఫోటోకు అంతర్జాతీయ అవార్డులే కాదు.. ప్రపంచానికి కొత్త ఆలోచనల్ని కలిగించేలా చేస్తోంది. చూసినంతనే మనసు వేదన చెందేలా.. కొత్త ఆలోచనలు చిగురించేలా చేయటమే కాదు.. యుద్ధం మీద ఆసక్తిని ప్రదర్శించే వారు.. దాని వెనుకున్న కష్టాన్ని ఇట్టే అర్థం చేసుకునేలా తాజా ఫోటో ఉంది. సిరియాలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్న దానికి నిదర్శనంగా ఈ ఫోటో ఉండటం గమనార్హం.నిత్యం యుద్ధం సాగుతూ.. శాంతి అన్నది లేక అక్కడి ప్రజలు విలవిలలాడే నేలకు చెందిన మున్జీర్.. అతడి కొడుక్కి సంబంధించిన ఫోటో ఇది. సిరియాలో జరిగిన ఒక బాంబుదాడిలో మున్జీర్ తన కాలును కోల్పోయాడు. దీంతో.. అతడు ఊత కర్ర ఆసరాగా చేసుకొని బతుకుతున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. యుద్ధంలో వెలువడిన నెర్వ్ గ్యాస్ ను పీల్చటం కారణంగా అతని సతీమణి.. కాళ్లు.. చేతులు లేని ముస్తఫా అనే కొడుక్కి జన్మను ఇచ్చింది.

సిరియా యుద్ధం తీసుకెళ్లి పోయిన సంతోషాన్ని.. తిరిగి సొంతం చేసుకోవటానికి వారు ఆ దేశాన్ని వదిలి దక్షిణ టర్కీ కు వెళ్లిపోయి.. అక్కడే సెటిల్ అయ్యింది. ఒక సంతోష సమయంలో ఆ తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఇట్టే అర్థమయ్యేలా ఫోటో తీశారు టర్కిష్ ఫోటో గ్రాఫర్ మెహ్మత్ అస్లస్. ఈ ఫోటో సియెనా ఇంటర్నేషనల్ ఫోటో అవార్డ్స్ 2021 కు ఫోటో ఆఫ్ ద ఇయర్ గా పురస్కారానికి ఎంపికైంది.

సిరియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న ప్రశ్నకు ఒకే ఒక్క ఫోటోతో సమాధానం చెప్పేలా ఉందీ చిత్రం. ఈ ఫోటోను చూసినంతనే చిన్న చిన్న కష్టాలకు బెదిరిపోతూ.. తమ కంటే దురద్రష్టవంతులు మరెవరూ లేరని ఫీలయ్యే వారందరికి..నిజంగామనమెంత లక్కీ అన్న విషయాన్ని ఈ ఫోటో చెప్పేస్తుందని చెప్పక తప్పదు.