దేవినేని అవినాష్ చేరిక పై నాని స్పందన ఇదే

Fri Nov 15 2019 16:10:02 GMT+0530 (IST)

This is the reaction of Nani on Avinash's Joining Ycp

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం లో టీడీపీ తరుఫున పోటీ చేసిన దేవినేని అవినాష్.. ఆయన ప్రత్యర్థి  వైసీపీ అభ్యర్థి అయిన కొడాలి నాని చేతిలో ఓడి పోయాడు. ఎన్నికల వేళ ఉప్పునిప్పుగా ఉన్న ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీ లో మిగిలారు. తాజాగా దేవినేని అవినాష్ గురువారం జగన్ సమక్షం లో  వైసీపీ లో చేరారు.తన ప్రత్యర్థి దేవినేని అవినాష్ చేరిక పై తాజాగా మంత్రి కొడాలి నాని స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. దేవినేని అవినాష్ ను గుడివాడ లో తన పై పోటీ చేయించి రాజకీయ బలి పశువును చేసిన ఘనత చంద్రబాబు కే దక్కుతుందని కొడాలి నాని విమర్శించాడు. దేవినేని అవినాష్ రాకను తాను ఆహ్వానిస్తున్నానని.. ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

చంద్రబాబు చేస్తున్న ఇసుక దీక్షతో విసుగు చెందే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వస్తున్నారని కొడాలి నాని చెప్పుకొచ్చాడు. త్వరలోనే టీడీపీ ప్రతిపక్ష హోదా ను కోల్పోనుందని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఇసుకను అడ్డంగా దోచుకున్నారని.. ఇప్పుడు వైసీపీ సర్కారు అడ్డుకుందనే ఈ పెడబొబ్బలు పెడుతున్నారని కొడాలి నాని విమర్శించాడు.