ఆయనవి తప్పా..తాలు మాటలే... చంద్రబాబుపై టీడీపీ టాక్ ఇదే...!

Sat Oct 01 2022 12:43:40 GMT+0530 (India Standard Time)

This is tdp's talk on Chandrababu!

ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. చంద్రబాబు పార్టీ కోసం.. ఎంతో చేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు.. నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఇంచార్జ్‌లను కూడా పార్లమెంటు వారిగా నియమించారు.  వారికి కొన్ని బాధ్యతలు కూడా అప్పగించారు. అదేసమయంలో నిద్రాణంగా ఉన్న పార్టీ కార్యకర్తలను కూడా లైన్‌లో పెడుతున్నారు. ఇక మండలాల వారీగా కూడా చర్చ చేస్తున్నారు.ఇదంతా కూడా.. పార్టీని వచ్చే ఎన్నికల్లో గాడిలో పెట్టేందుకు అధికారంలోకి తెచ్చేందుకు.. అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే..కొన్నికొన్ని నగరాల్లో మాత్రం.. కొందరునాయకులు.. ఇంకా..అలక పాన్పు దిగడం లేదు. మరికొందరు పార్టీలో ఉన్నారో.. లేరో కూడా తెలియదు. ఇంకొందరు పార్టీలోనే ఉండి.. పార్టీమేలు కోసం కాకుండా.. పార్టీ నేతలపై సటైర్లు వేసేందుకు మాత్రమే తమ సమయం కేటాయిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

మరి దీనికి కారణం..ఏంటి? ఎందుకు? అనేది చూస్తే.. చాలా ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశాలకు చోటా నాయకులను మాత్రమే ఆహ్వానిస్తున్నారని.. కీలక నేతలను పిలవడం లేదని.. ఇది తమను అవమానించడం కాదా? అని కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక గెలిచిన ఎంపీలను.. ఎమ్మెల్యేలను సంప్రదించి.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించడం లేదని అంటున్నారు.

ఈ పరిణామాలపైనే.. విజయవాడ ఎంపీ.. నాని వంటి వారు.. సీరియస్‌గా ఉన్నారని అంటున్నారు. "ఏం చేస్తున్నారు.. తప్పాతాలుతో సమావేశాలు పెట్టి.. ఏం చేస్తారు?  ఏం మాట్లాడతారు?" అని ఒక కీలక నాయకుడు.. ఆఫ్‌దిరికార్డుగా వ్యాఖ్యానించారు. దీనిని బట్టి.. చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశాల్లో కొందరు కీలక నేతలకు ప్రాధాన్యం ఉండడం లేదని.. అందుకే వారు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో.. యనమల వంటివారే చెప్పాలని అంటున్నారు పరిశీలకులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.