Begin typing your search above and press return to search.

మోడీ ప్రసంగం.. వరాలు లేవు.. కేవలం కరోనా హెచ్చరికే

By:  Tupaki Desk   |   20 Oct 2020 5:30 PM GMT
మోడీ ప్రసంగం.. వరాలు లేవు.. కేవలం కరోనా హెచ్చరికే
X
కరోనా తర్వాత దేశం క్రమంగా కోలుకుంటోందని ప్రధాని మోడీ అన్నారు. కానీ కరోనా ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉందని అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పండుగల సీజన్ వచ్చిందని.. ప్రజలంతా రోడ్ల మీదకు వస్తున్నారని.. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కుదుట పడుతోందని మోడీ అన్నారు.

ప్రపంచదేశాలతో పోల్చితే దేశంలో దేశంలో కరనా మరణాల రేటు తక్కువని మోడీ అన్నారు. అమెరికా, బ్రెజిల్, బ్రిటన్ ల కంటే దేశంలో మరణాలు తక్కువగా నమోదయ్యాయని.. విస్తరణ వేగం కూడా తక్కువ అన్నారు. కోవిడ్ పై పోరాటం ఇంకా కొనసాగుతోందని మోడీ అన్నారు. కరోనా మనల్ని ఇప్పుడే వదిలి పెట్టదని మోడీ హెచ్చరించారు. పరిస్థితిని ఇలాగే కొనసాగిద్దామని అన్నారు.

10 లక్షల మందిలో కేవలం కేవలం 83మంది మాత్రమే భారత్ లో మరణించారని మోడీ తెలిపారు. 10 లక్షల మందిలో ఐదున్నర వేల మందికి మాత్రమే కరోనా సోకిందని మోడీ అన్నారు. దేశంలో కరోనా విస్తరణ, మరణాల రేటు తక్కువ అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో అగ్రదేశాల కంటే భారత్ ముందు ఉందని.. బాగా పనిచేస్తోందని మోడీ అన్నారు. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఏమాత్రం ఆదమరిచిన ముప్పు తప్పదని మోడీ హెచ్చరించారు.

కరోనాపై పూర్తిగా విజయం సాధించేవరకు వదిలిపెట్టవద్దని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. దేశంలో 2వేలకు పైగా ల్యాబులు టెస్టులు చేస్తూ ప్రజలను రక్షిస్తున్నాయన్నారు.కరోనా వేళ పండుగల వేళ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మోడీ పిలుపునిచ్చారు. దేశంలో వైద్యులు బాగా పనిచేస్తున్నారని.. 90 లక్షల బెడ్స్ ఆస్పత్రుల్లో ఉన్నాయన్నారు.