Begin typing your search above and press return to search.

చిరంజీవి ట్వీట్ కు జగన్ స్పందన ఇదీ

By:  Tupaki Desk   |   23 Jun 2021 2:32 PM GMT
చిరంజీవి ట్వీట్ కు జగన్ స్పందన ఇదీ
X
తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నా సరే.. అన్నయ్య చిరంజీవి మాత్రం ఏపీలోని జగన్ సర్కార్ కు, జగన్ నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఒకసారి జగన్ ను కలిసి ఆయన పాలనను మెచ్చుకున్న చిరంజీవి ఇటీవల ఏపీలో నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

ఏపీలో రికార్డు స్థాయిలో ఒకేరోజు 13 లక్షలకు పైగా టీకాలు వేయడాన్ని మెగాస్టార్ చిరంజీవి నిన్న ట్విట్టర్ లో అభినందించారు. జగన్ చేసిన పనిపై సంతోషం వ్యక్తం చేశారు. ఒకరోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయించిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కరోనా కట్టడి విషయంలో జగన్ చూపిస్తున్న చొరవను మెచ్చుకున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ఆదర్శ పాలన అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు.

తాజాగా చిరంజీవి ప్రశంసలపై ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ లోనే స్పందించారు. చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేశాడు.. 'చిరంజీవి గారు, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున, మీ ప్రేమ పూర్వక ప్రశంసలకు ధన్యవాదాలు. ఈ క్రెడిట్ అంతా విలేజ్/వార్డ్ సెక్రటేరియట్స్, వాలంటీర్స్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, పీహెచ్.సీ వైద్యులు, మండల అధికారులు, జిల్లా అధికారులు, జేసీలు, కలెక్టర్ల బృందానికి వెళుతుంది 'అని సీఎం జగన్ ఈ సందర్భంగా చిరంజీవికి విన్నవించారు.

గతంలో కూడా చిరంజీవి ఎన్నో జగన్ సర్కార్ పథకాలు, పాలనపై ప్రశంసలు కురిపించారు. స్వయంగా వెళ్లి కూడా కలిసి ప్రశంసించిన సందర్భాలున్నాయి. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అటు కేసీఆర్, ఇటు జగన్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ టాలీవుడ్ సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా మారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు పలు సహాయాలు కూడా చేస్తున్నారు.