Begin typing your search above and press return to search.

ఈమె నడుము ఇలియానే ఈర్ష్య పడేలా ఉందిగా...

By:  Tupaki Desk   |   5 Aug 2020 1:30 AM GMT
ఈమె నడుము ఇలియానే ఈర్ష్య పడేలా ఉందిగా...
X
నడుము అంటే ఇలియానాదే. ఇప్పటి కుర్రకారుకు ఆమె నడుము నచ్చినట్లుగా మరెవరిదీ నచ్చలేదంటే అతిశయోక్తి కాదు. ముందు 'దేవదాస్ 'సినిమాతో గిలిగింతలు పెట్టిన ఇలియానా ఆ తర్వాత 'పోకిరి'లో తెగరెచ్చిపోయింది. తన నడుమందాలతో కుర్రకారు మతి పోగొట్టింది. ఆ సినిమా తర్వాతే నడుమందం అంటే ఇలియానాదే అన్నంతగా నడుము అందానికి ఒక కొలమానంలా మారింది. జులాయిలోనూ గురూజీ త్రివిక్రమ్ ఇల్లీ నడుమందాలను భలే ఫోకస్ చేశాడు. అంతటి ఇలియానే కుళ్ళుకునే నడుము అందంతో ప్రస్తుతం ఓ మయన్మార్ యువతి సోషల్ మీడియాలో కుర్రాళ్ళని హీటెక్కిస్తోంది. అసలు ఆ అమ్మాయిని చూస్తే అసలు నడుమెక్కడా అని అనాల్సిందే. అంత నాజూగ్గా ఉందా నడుము. మయన్మార్ కు చెందిన 23 ఏళ్ళ సుమోహ్ నాయింగ్ తన నడుముతోనే సెలబ్రిటీగా మారిందంటే ఎవరూ నమ్మరు. ఆమె నడుము సైజు 13.7. ప్రపంచంలోనే అత్యంత చిన్న నడుముగా గుర్తింపు పొందింది. నాయింగ్ తన నడుమును ప్రదర్శిస్తూ ఫొటోలు దిగుతూ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. దీంతో ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నారు. మంచి ఆహారం, వ్యాయామం తన తన నడుము అందానికి కారణమని చిరు నవ్వులు చిందిస్తూ నాయింగ్ సమాధానం ఇస్తోంది.