రాఖీ ఏ టైమ్‌లో కట్టాలి .. 558 ఏళ్ల తర్వాత వచ్చిన మంచిరోజు !

Mon Aug 03 2020 17:40:20 GMT+0530 (IST)

Rakhi should be tied at any time .. Good day after 558 years!

నేడు దేశం మొత్తం రక్షబంధన్ పండుగను ఎంతో శాస్త్రోక్తంగా సంప్రదాయంగా జరుపుకుంటుంది. రక్షాబంధన్ హిందువుల ప్రధాన పండుగ దీనిని శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రాఖీ పండుగ సోదర సోదరిమణుల అచంచలమైన ప్రేమకు చిహ్నం. ఈ రోజున సోదరీమణులు సోదరుడి మణికట్టు మీద రాఖీని కట్టి సుదీర్ఘ జీవితాన్ని కోరుకుంటారు.అన్నా తమ్ముళ్లు అక్కచెల్లలను రక్షించుకుంటామని వాగ్దానం చేస్తారు. రాఖీ కట్టిన సోదరికి ఆ తరువాత సోదరుడు బహుమతి ఇస్తాడు.రక్షాంధన్ పవిత్ర సమయంలో రాఖీని కట్టాలి. ఈ పండుగలో పంచాంగం ప్రకారం అనేక శుభ యోగాలు జరుగుతున్నాయి. రాఖీ కట్టడానికి శుభ సమయం ఉదయం 9 నుండి 10:22 వరకు మరియు మధ్యాహ్నం 1:40 నుండి 6:37 వరకు... ఈ మధ్య సమయంలో రాఖి కట్టడానికి ఎంతో పవిత్రమైన సమయం. అలాంటి మంచి సమయంలో రాఖీని కట్టడం శుభ ఫలితాలను ఇస్తుందని శుభప్రదమని విశ్వసిస్తారు.

ఈ రోజున రెండు ప్రత్యేక యాదృచ్చిక సంఘటనలు చోటుచేసుకున్నట్లుగా జ్యోతిష్కులు తెలుపుతున్నారు. రక్షా బంధన్ 29ఏళ్ల తర్వాత సర్వార్థ సిద్ధి మరియు ఆయుష్మాన్ దీర్ఘాయువుల శుభ కలయికగా వస్తుంది. రెండవది 558 సంవత్సరాల తరువాత ఆగస్టు 3 న సావన్ నెల పౌర్ణమి నాడు గురు శని రాహు మరియు కేతువుల కదలికలు తిరోగమనం సమయంలో వస్తుంది. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం ఈ మహాసయోగం మేషం వృషభం కన్య ధనుస్సు మరియు మకరం రాశులవారికి చాలా పవిత్రంగా ఉంటుంది.