Begin typing your search above and press return to search.

శృంగారం వేళ బెడ్ రూంలో చేయకూడని పనులు ఇవే..

By:  Tupaki Desk   |   24 Feb 2020 4:20 AM GMT
శృంగారం వేళ బెడ్ రూంలో చేయకూడని పనులు ఇవే..
X
శృంగారంలో పాల్గొనడం వల్ల చక్కటి రిలీఫ్ లభిస్తుందనే సంగతి తెలిసిందే. రతి క్రీడను స్త్రీ పురుషులిద్దరూ ఆస్వాదించాలి. అప్పుడే పార్టనర్‌కు మనపై ప్రేమ పెరుగుతుంది. ఒంటెద్దు పోకడ వల్ల మీకు సౌఖ్యం తప్పితే తనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. లవర్ లేదా వైఫ్‌తో బెడ్రూంలో ఏకాంతంగా గడిపేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. బెడ్రూంలో కొన్ని పనులు చేయడం వల్ల అసలుకే ఎసరు వస్తుంది. పడక గదిలో చేయకూడని పనులేంటో చూద్దాం.

*నమ్మశక్యంగా లేకపోయినా.. చాలా మంది శృంగారం లో పాల్గొనేటప్పుడు ముద్దు పెట్టుకోరు. రతిలో పాల్గొనాలనే తొందర కావచ్చు, లేదంటే యాంగ్జయిటీ కావచ్చు.. చాలా మంది ముద్దు పెట్టరు. కానీ శృంగారానికి సన్నద్ధం అవుతున్నప్పుడు భాగస్వామిని కిస్ చేయడం ముఖ్యం. దీని వల్ల తనకు చక్కటి హాయి లభిస్తుంది.

*శృంగారంలో భాగస్వామిని చిలిపిగా కొరకడం సాధారణమే. దీన్ని చాలా మంది ఇష్టపడతారు కూడా. కానీ పూర్తిగా రంగంలోకి దిగక ముందే కొరకడం వల్ల ఫలితం ఉండదు. అది వారికి నొప్పిని, అసౌకర్యాన్నికలిగిస్తుంది. ఫలితంగా మీరంటేనే వారు భయపడే అవకాశం ఉంది. కాబట్టి మీ పార్టనర్ మూడ్ బాగున్నప్పుడే తన భుజాలు, మెడ లేదా చెవి వంటి కామాన్ని ప్రేరేపించే భాగాల్లో సున్నితంగా కొరకండి.

*మర్మంగాలను తప్పించి మిగతా శరీర భాగాల్ని పట్టించుకోక పోవడం ఫలితాన్ని ఇవ్వదు. మెకాలు, మణికట్టు, వీపు, పొట్ట భాగంలో ముద్దులు కురిపించడం వల్ల పార్టనర్ రతి క్రీడకు సన్నద్ధం అయ్యే అవకాశాలుంటాయి. ఆయా భాగాల్లో మృదువుగా తాకడం వల్ల తను మూడ్‌లోకి వచ్చి సహకరించే వీలుంది.

*కొంత మంది బెడ్రూంలో ఏకాంతంగా గడిపేటప్పుడు పార్టనర్‌ మీద పడి పోతుంటారు. అమ్మాయిలైనా ఇలా పడిపోవడం సరికాదు. మీ బరువు మొత్తం ఎదుటి వ్యక్తి మీద పడితే ఇబ్బంది పడతారు. శ్వాస తీసుకోవడం కష్టమైతే.. వారు సహకరించడం కుదరదు.

*ఇది మగాళ్లకు చాలా ముఖ్యమైన అంశం. వీర్యస్ఖలనానికి కారణమయ్యే కండరాల మీద పట్టు ఉండాలి. సరైన టైంలోనే వీర్యం బయటకు వచ్చేలా జాగ్రత్త పడాలి. త్వరగా అవుటైపోతే పార్టనర్ అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. ఆలస్యమైనా వారు ఇబ్బంది పడతారు. ఈ ఇబ్బందిని నివారించడానికి ఎక్కువసేపు ఫోర్ ప్లే చేయాలి. మీ పార్టనర్ భావప్రాప్తి పొందడానికి మీ వంతుగా సహకరించాలి.

*ఓరల్ సెక్స్ లేదా మామూలు శృంగారంలోనైనా క్లయిమాక్స్ చేరుకునేటప్పుడు పార్టనర్‌ కు ముందే చెప్పడం ఎంతో ముఖ్యం. ఇది ఆడవాళ్లకు కూడా వర్తిస్తుంది.

*చాలా జంటలు కాస్త అసభ్యంగా ఉండే రతి క్రీడను కూడా ఆస్వాదిస్తాయి. కానీ అలా ప్రవర్తించడానికి ముందు పార్టనర్‌తో మాట్లాడి.. ఒప్పుకుంటేనే చేయాలి. యానల్ సెక్స్ లాంటి విషయాల్లో పార్టనర్‌ను ఇబ్బంది పెట్టొద్దు. తనకు తెలియకుండా మీరు అలా చేస్తున్న ప్పుడు మొదట్లో వారికి నచ్చినట్లే ఉండొచ్చు. కానీ చివరికి వచ్చేసరికి పరిస్థితి మరోలా ఉండే ప్రమాదం ఉంది.

*ఏకాంతంగా ఇద్దరూ ఎంజాయ్ చేసే టైంలో పార్టనర్ మాట్లాడాలని ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి నోరు మెదపకుండా కూర్చునే బదులు.. ఏదైనా మాట్లాడటమో లేదంటే.. తీపి శబ్దాలు చేయడమో చేయండి. ఇలా చేయడం వల్ల పార్టనర్‌కు ఉత్సాహం వస్తుంది.

*శృంగారాన్ని ఆస్వాదించాలి కానీ యాంత్రికంగా ఏదో చేశాం అనిపించకూడదు. అదేమీ జిమ్ కాదు కదా. చాలా మంది మొదట్లో ఈ విషయంలో బాగానే ఉంటారు. కానీ కాలం గడిచే కొద్దీ ఏదో మొక్కుబడిగా ముగిస్తుంటారు. కాస్త క్రియేటివ్‌ గా, వినూత్నంగా ప్రయత్నించడం వల్ల ఈ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు.