Begin typing your search above and press return to search.

శృంగారం చేసేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

By:  Tupaki Desk   |   2 Dec 2021 1:30 PM GMT
శృంగారం చేసేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
X
ప్రతి మనిషి సుఖంగా జీవించడానికి శృంగారం కూడా అవసరం. మనిషి ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉండడానికి శృంగారం అత్యంత ఆవశ్యం అని అంటున్నారు. శృంగారం మానసికోల్లాసానికే కాకుండా ఆరోగ్యకరం అని కూడా వైద్యులు ధ్రువీకరించారు. అంతేకాకుండా ఆరోగ్యకర శృంగారం జంట మధ్య ప్రేమానుబంధం పెంపొందిస్తుంది. అయితే శృంగారం గురించి అనేక కథలు, నవలలు వస్తున్నా.. ఇంకా దీని మీద కొందరికి అవగాహన రావడం లేదు. సోషల్ మీడియా ట్రెండ్ ఎక్కువ కావడంతో ఇందులో ప్రసారమయ్యే అసత్య వీడియోలను చూస్తూ వాటిని అనుకరిస్తున్నారు. దీంతో అనారోగ్యపాలవుతున్నారు. శృంగారం విషయంలో ఎంత తెలుసుకున్నా తక్కువే. కానీ చిన్న చిన్న విషయాలపై అవగాహన ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

శృంగారంలో పాల్గొన్న వ్యక్తికి సుఖ భావప్రాప్తి కలగాలని కోరుకుంటారు. అయితే కొందరికి మరింత సుఖం కావాలని కోరుకుంటారు. ఎక్కువ సంతోషంగా గడపడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. శృంగారంలో ఉన్న సందేహాలను చాలా మంది ఇతరులతో పంచుకోరు. వైద్యులను సంప్రదించేంత సమయమూ ఉండదు. దీంతో వీరు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని అసత్య వీడియోలను చూస్తూ వాటిని అనుసరిస్తున్నారు. దీంతో మొదటికే మోసం అవుతుంది.

శృంగారం చేసేటప్పుడు కొందరు భాగస్వామికి చెందిన జననాంగాలు వదులుగా కావడానికి లేదా బిగుతుగా కావడానికి కొందరు లోషన్స్ వాడుతుంటారు. ఇంకొందరు పెట్రోలియం జెల్లిని ఉపయోగిస్తారు. అయితే పెట్రోలియం జెల్లిని ఉపయోగించి వాటిని నోటితో మర్దన చేస్తారు. దీంతో పెట్రోలియం జెల్లిలో ఉన్న బ్యాక్టిరియా వారి శరీరంలోకి వెళ్లడమే కాకుండా మర్ధన చేసేవారి నోట్లోకి కూడా పోతుంది. దీంతో లేని రోగాలను కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక రోగాలు మొదలవుతాయని వైద్యులు తెలుపుతున్నారు.

ఇక కొందరు అతిగా సుఖపడేందుకు లూబ్రికెంట్స్ గా బాడీ లోషన్స్ వాడుతుంటారు. అంతేకాకుండా ఆలివ్ ఆయిల్ కూడా ఉపయోగిస్తారు. సాధరణ స్రవాలు కాకుండా అతిగా కావాలని కోరుకుంటారు. దీంతో అసహజమైన శృంగారాన్ని చేస్తారు. ఇది కొందరి భాగస్వామిలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయడంతో ఎదటివారిని ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది. అంతేకాకుండా అసహజ శృంగారం చేస్తున్నప్పుడే ఎలాంటి పెయిన్ ఉండదు. కానీ ఆ తరువాత విపరీతంగా బాధపడాల్సి వస్తుంది. అందువల్ల అసహజ శృంగారం కోసం కొత్త రోగాలను తెచ్చే లోషన్స్, పెట్రోలియం జెల్ ను వాడకపోవడమే మంచిదని అంటున్నారు.

ఇలాంటివే కాకుండా కొందరు ఎక్కువగా అందంగా కనిపించేందకు సర్జరీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటివి తాత్కాలికంగా సుఖాన్నిచ్చినా రాను రాను వాటితో ప్రమాదంగానే ఉంటుంది. ఎక్కువ తృప్తినిచ్చే శృంగారం కావాలంటి భాగస్వామిని మానసికంగా సంతోషపెట్టండి. దీంతో వారిలో కోరికలు పుట్టుకొస్తాయి. ఆ తరువాత మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉంటారు. వారి మనసుకు ఏది నచ్చుతుందో అదే చేయండి. అప్పుడు వారు నిత్యం ఉల్లాసంగా ఉంటూ శృంగారంలో మీకు సహకరించే అవకాశం ఉందని మానసిక తత్వవేత్తలు వివరిస్తున్నారు.

ప్రేమతో కూడిక శృంగారం ఇరువురికి సంతోషాన్నిస్తుంది. అయితే కొందరు ఫోర్న్ వీడియోస్ చూస్తూ అసహజ శృంగారానికి అలవాటు పడుతుంది. ఇలా ఒక్కసారి తృప్తి చెందడంతో పదే పదే ఇలాగే చేయాలనిపిస్తుంది. దీంతో రోజులు గడిచిన కొద్దీ ఎక్కువ సంతృప్తి పొందే అవకాశాలు తక్కేవేనని వైద్యులు అంటున్నారు. కానీ కొందరు అవేమీ పట్టించుకోకుండా అసహజ శృంగారానికే మొగ్గు చూపుతున్నారు. శృంగారం ఇద్దరి వ్యక్తులకు సంబంధించినది. ఈ విషయంలో ఇద్దరు సంతృప్తి చెందితేనే సంతోషంగా ఉంటుంది. అయితే ఒక్కరి ఆనందం కోసం ఎదుటివారిని ఇబ్బందిపెట్టడం వల్ల వ్యక్తుల మధ్య సఖ్యత కొరవడుతుంది. దీంతో రాను రాను సంబంధాల్లో తేడాలు వస్తాయి.